Sukesh Chandra Shekar | బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి ప్రేమలేఖ రాశాడు. రూ.200కోట్ల మోసం కేసులో మండోలి జైలులో ఉన్న సుకేశ్ తాజాగా దీపావళి పండుగ సందర్భంగా బేబీ..! తాను త్వరలోనే తిరిగి వస్తానంటూ జైలు నుంచే మరో సందేశాన్ని పంపాడు. అయితే, వీరిద్దరి ప్రేమను ప్రముఖ ఇతిహాసం రామాయణంతో పోల్చాడు. అంతటితో ఆగకుండా జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను సీతగా.. సుకేశ్ తనను తాను రాముడిగా పోల్చుకున్నాడు. రాముడు వనవాసం నుంచి తిరిగి వచ్చినట్లుగా.. తాను త్వరలోనే జైలు నుంచి వస్తానంటూ లేఖలో చెప్పుకొచ్చాడు. గురువారం దీపావళి సందర్భంగా శ్రీలంకన్ బ్యూటీకి ఆర్థిక నేరగాడు దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు.
త్వరలోనే తాను విడుదలయ్యే అవకాశం ఉందని.. ఈ దీపావళి తనకు ప్రత్యేకంగా నిలువనున్నదని పేర్కొన్నాడు. అదే సమయంలో మరో రెండు బెయిల్స్ వస్తే తాను బయటకు వస్తానని చెప్పాడు. జాక్వెలిన్‌కు రాసిన లేఖలో.. ‘బేబి మన ప్రేమకథ రామాయణం కంటే తక్కువ ఏం కాదు. రాముడు వనవాసం నుంచి సీతతో తిరిగి వచ్చినట్లుగా తాను సైతం ఈ వనవాసం నుంచి తిరిగి వస్తాను’ అంటూ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా దీపావళి శుభాకాంక్షలు చెబుతూ.. జాక్వెలిన్‌ను మిస్ అవుతున్నానని చెప్పాడు. జాక్వెలిన్‌తో జీవితం అందంగా ఉంటుందని.. ఆమె లేకుండా ఎప్పటికీ జీవించలేనని చెప్పుకొచ్చాడు.
ఇద్దరి బంధాన్ని చూసి ఈ ప్రపంచమంతా తప్పుగా అర్థం చేసుకుందని.. తాను పిచ్చివాడినని ఈ ప్రపంచం అనుకోవచ్చని.. కానీ, మన మధ్య ఏం ఉందో ఈ ప్రపంచానికి ఏం తెలుసునని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఇటీవలి జాక్వెలిన్ ప్యారిస్ ట్రిప్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ప్యారిస్ ట్రిప్ కొత్త ఫొటోలు అద్భుతంగా ఉన్నాయంటూ మెచ్చుకున్నాడు. బ్లాక్ డ్రెస్‌లో అందంగా ఉన్నావంటూ కితాబునిచ్చాడు. ఈ ట్రిప్ ఫొటోల్లో ఏదో ప్రత్యేకత ఉందని లేఖలో పేర్కొన్నాడు. ఇక జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ‘స్మార్ట్రైడర్’ ఎక్కువసార్లు విన్న వారికి మహేంద్ర థార్‌తో పాటు ఐఫోన్ 16 ప్రో గిఫ్ట్‌గా ఇస్తానని.. ఈ ఆఫర్‌ని డిసెంబర్ 25 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఆల్బమ్ సూపర్‌హిట్ చేసిన వారికి 25 మహీంద్రా థార్ రోక్స్, 200 ఐఫోన్ ప్రోలు అందిస్తానని లేఖలో పేర్కొన్నాడు.