Mandaadi | కలర్‌ఫొటో ఫేం సుహాస్. కథను నమ్మి సినిమా చేసే సుహాస్స్ ఇక తమిళంలో కూడా తనను తాను నిరూపించుకోవాలనుకుంటున్నాడు. సుహాస్ నటిస్తోన్న తమిళ చిత్రం మండాడి (Mandaadi). సెల్ఫీ ఫేం మతిమారన్ పుగళేంది డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇంటెన్స్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తోంది. కోలీవుడ్ యాక్టర్ లీడ్ సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. తాజా అప్డేట్ ప్రకారం ఈ మూవీ షూటింగ్ 70 శాతం పూర్తయినట్టు సమాచారం. ఈ మూవీని వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రేక్షకులు సన్నాహాలు చేస్తున్నారు.
సుహాస్, సూరి టీంపై వచ్చే హై ఇంటెన్సిటీతో సముద్రంలో సాగే యాక్షన్ పార్ట్‌తోపాటు సెయిల్ బోట్ రేస్ సినిమాకే హైలెట్‌గా ఉండబోతుందట. ఈ సీక్వెన్స్ కోసం సూరి, సుహాస్ టీం ప్రత్యేకంగా ఆరు నెలలపాటు కఠిన శిక్షణ పొందారని టాక్. పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్‌గా చేసుకుని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజవుతున్న ఈ మూవీ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని ఇప్పటివరకు వచ్చిన పోస్టర్లు చెబుతున్నాయి. హాలీవుడ్ యాక్షణ్ కొరియోగ్రఫర్ ఈ సినిమాలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో యాక్షన్ పార్ట్‌ను రెడీ చేశాడట.
ఈ చిత్రానికి పాపులర్ యాక్షన్ కొరియోగ్రఫర్ పీటర్ హెయిన్స్ పనిచేస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ చిత్రంలో మహిమా నంబియార్ కీలక పాత్రలో నటిస్తోంది. సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మనుగడ, వ్యక్తిగత గుర్తింపు, మానవ స్ఫూర్తి లాంటి థీమ్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్పొటైన్మెంట్ తెరకెక్కిస్తోంది. మండాడి రూ.75 కోట్ల బడ్జెట్‌తో రాబోతుంది.
భారీ బడ్జెట్ 75 కోట్లు తో, గ్రాండ్ స్కేల్ లో మూవీ #Mandaadi సమ్మర్ 2026 రిలీజ్.. @sooriofficial @ActorSuhas @rsinfotainment pic.twitter.com/QSiGjyE0qW
— H A N U (@HanuNews) January 2, 2026