Suhas | టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ మరోసారి తండ్రి అయ్యాడు. ఆయన భార్య లలిత పండంటి బాబు (కొడుకు)కి జన్మనిచ్చింది. ఈ శుభవార్తను స్వయంగా సుహాస్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. భార్య, చిన్నారితో కలిసి తీసిన ఫోటోను పోస్ట్ చేస్తూ ఆనందాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఇదివరకు 2024లో సుహాస్–లలిత దంపతులకు తొలి సంతానంగా కూడా అబ్బాయినే పుట్టాడు. ఇప్పుడు, రెండోసారి కూడా బాబు పుట్టడంతో కుటుంబంలో ఆనందం రెండింతలైంది. నెటిజన్లతో పాటు టాలీవుడ్ సెలెబ్రిటీలు, స్నేహితులు, సహచరులు సుహాస్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సుహాస్–లలితల ప్రేమకథ సినిమాల మాదిరిగానే సాగింది. దాదాపు ఏడేళ్లు ప్రేమించుకుని, 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరి జీవితంలో ఇద్దరు బిడ్డలు ఆనందాన్ని పెంచుతున్నారు. షార్ట్ ఫిల్మ్స్‌తో అరంగేట్రం చేసిన సుహాస్, ‘కలర్ ఫోటో’ చిత్రంతో హీరోగా నిలదొక్కుకున్నాడు. ఆ తర్వాత ‘రైటర్ పద్మభూషణ్’, ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ వంటి విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. ‘ఉప్పు కప్పు రంబు’, ‘ఓ భామ అయ్యో రామ’, ‘జనక అయితే గనక’, శ్రీరంగ నీతులు, ప్రసన్నవదనం, గొర్రె పురాణం వంటి మూవీస్‌లో నటించి మెప్పించారు. ప్రస్తుతం తెలుగులో హే భగవాన్ చేస్తుండగా ‘మండాడి’ మూవీతో తమిళంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
ప్రస్తుతం సుహాస్ చేస్తున్న ‘మండాడి’ అనే తమిళ సినిమాలో తొలిసారి విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రముఖ తమిళ నటుడు సూరి హీరోగా నటిస్తుండగా, ఇటీవల సుహాస్ లుక్కు విశేష స్పందన లభించింది. తాజాగా సుహాస్ మరోసారి తండ్రి అయ్యాడని తెలిసాక సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున “కంగ్రాట్స్ సుహాస్ & లలిత” అంటూ కామెంట్లు చేస్తున్నారు. “ఇంకో మినీ పద్మభూషణ్ వచ్చేశాడు!” అంటూ ఫన్నీ కామెంట్లు కూడా ట్రెండ్ అవుతున్నాయి.