Mandaadi | టాలీవుడ్ యాక్టర్ సుహాస్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం మండాడి (Mandaadi). తమిళ నటుడు సూరి మరో లీడ్ రోల్లో నటిస్తున్నాడు. సెల్ఫీ ఫేం మతిమారన్ పుగళేంది డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తీర ప్రాంతం, మత్య్సకారుల నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా వస్తోంది. మండాడి సెప్టెంబర్ 4న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ కొత్త పోస్టర్ విడుదల చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో సుహాస్ సాట్టపులి పాత్రలో కనిపించబోతున్నాడు.
మేకర్స్ సుహాస్ పాత్ర ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ మేకింగ్ వీడియో విడుదల చేశారు. సహాస్ లాంగ్ హెయిర్, స్టైలిష్ గాగుల్స్‌తో సిగరెట్ వెలిగిస్తూ లుక్‌తో రిలీజ్ చేసిన వీడియోలో ఇదివరకెన్నడూ లేని విధంగా తనలోని విశ్వరూపాన్ని చూపించబోతున్నాడని విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి. మొత్తానికి ఈ సినిమాతో సుహాస్ సౌత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకోవడం ఖాయమని అర్థమవుతోంది.
మూవీ రియలిస్టిక్‌గా ఉండాలనే ఉద్దేశంతో రియల్ లొకేషన్స్‌లో షూట్ చేయడం విశేషం. ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన పోస్టర్లు నెట్టింట, మూవీ లవర్స్‌లో హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో మహిమా నంబియార్ కీలక పాత్రలో నటిస్తుండగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ ఇతర కీ రోల్స్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా.. ఆర్ఎస్ ఇన్పొటైన్మెంట్ తెరకెక్కిస్తోంది.
సుహాస్, సూరి టీంపై వచ్చే హై ఇంటెన్సిటీతో సముద్రంలో సాగే యాక్షన్ పార్ట్‌తోపాటు సెయిల్ బోట్ రేస్ సినిమాకే హైలెట్‌గా ఉండబోతుందంటూ మేకర్స్ ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఈ మూవీకి పాపులర్ యాక్షన్ కొరియోగ్రఫర్ పీటర్ హెయిన్స్ పనిచేస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.