Maama Mascheendra Movie | స్టైలిష్ లుక్‌లో సుధీర్‌బాబు.. మామా మశ్చీంద్ర సెకండ్ పోస్టర్ రిలీజ్
పుష్కర కాలంగా ఇండస్ట్రీలో ఉంటున్నా కమర్షియల్ సక్సెస్‌కు నోచుకోలేకపోతున్నాడు యంగ్ హీరో సుధీర్‌బాబు. కెరీర్ బిగెనింగ్ నుంచి కొత్త తరహా కథలతో వస్తున్నా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం భారీ విజయాలు సాధించలేకపోతున్నాయి.
Maama Mascheendra Movie | పుష్కర కాలంగా ఇండస్ట్రీలో ఉంటున్నా కమర్షియల్ సక్సెస్‌కు నోచుకోలేకపోతున్నాడు యంగ్ హీరో సుధీర్‌బాబు. కెరీర్ బిగెనింగ్ నుంచి కొత్త తరహా కథలతో వస్తున్నా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం భారీ విజయాలు సాధించలేకపోతున్నాయి. నిజానికి సుధీర్‌బాబు.. ఐదేళ్ల క్రీతం వచ్చిన ‘సమ్మోహనం’ సినిమాతో కాస్త లైమ్‌లోకి వచ్చాడు. అంతకు ముందు ఆయన సినిమాలు రిలీజయ్యే విషయం కూడా సగం మందికి తెలియదు. ఇక ప్రస్తుతం ఆయన ‘మామా మశ్చీంద్ర’ అనే యాక్షన్ డ్రామా సినిమా చేస్తున్నాడు. ప్రముఖ కమేడియన్ హర్షవర్ధన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేసి అందరిని షాక్‌కు గురిచేశారు. సిక్స్ ప్యాక్‌తో అల్ట్రాస్టైలిష్గా కనిపించే సుధీర్.. ఒక్కసారిగా లడ్డుబాబులా మారిపోయాడేంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సినిమాలో సుధీర్ మూడు విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నాడు. అందులో ఒక పాత్ర బొద్దుగా ఉండనుంది. ఇక ఇదిలా తాజాగా ఈ సినిమాలోని రెండో గెటప్‌కు సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం తాజాగా రిలీజ్ చేసింది. నెరిసిన గడ్డంతో గాగుల్స్ ధరించి చేతిలో తుపాకీతో స్టైలిష్‌లుక్‌లో సుధీర్ పోస్టర్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. పరుశురామ్గా ఈ పాత్రలో అలరించనున్నాడు.
‘హంట్’తో అభిమానులను కాస్త నిరాశపరిచిన సుధీర్‌బాబు ఈ సినిమాతో మాత్రం పక్కాగా హిట్టు కొట్టేలానే కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మూడో గెటప్‌ను మార్చి 7న రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
"You can find him in your shadow"
Here's the Terrific Second Look of @isudheerbabu as #Parasuram from #MaamaMascheendra 🔥#SBasParasuram @HARSHAzoomout @YoursEesha @mirnaliniravi @chaitanmusic @pgvinda @AsianSuniel @puskurrammohan @SVCLLP #SrishtiCelluloids pic.twitter.com/MCoa5tYppZ
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) March 4, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

