Sudheer Babu | టాలీవుడ్ యాక్టర్ సుధీర్ బాబు (Sudheer Babu) జ్ఞానసాగర్ ద్వారకా డైరెక్షన్లో నటించిన హరోంహర రీసెంట్గా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. హరోం హర ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి కూడా స్ట్రీమింగ్ కానుంది. కాగా మరోవైపు సుధీర్ బాబు పాన్ ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌కు సంతకం చేశాడని తెలిసిందే. తాజాగా కొత్త సినిమాకు సంబంధించిన వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చిత్రీకరణ కోసం సుధీర్ బాబు అండ్ టీం ముంబైలోని ల్యాండింగ్ అయింది. సుధీర్ బాబు 19వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం. వెంకట్ కల్యాణ్ (డెబ్యూ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రుస్తుం, టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్, పారి లాంటి నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమాలను నిర్మించిన ప్రేరణ అరోరా, శివ్, నిఖిల్, ఉజ్వల్ ఆనంద్‌తో కలిసి తెరకెక్కిస్తున్నారు. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రం
సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో పాపులర్ బాలీవుడ్ హీరోయిన్ కీలక పాత్రలో నటించనున్నట్టు వార్తలు వస్తుండగా.. మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. తాను ఈ స్క్రిప్ట్, జోనర్ కోసం నేను ఏడాదికిపైగా అన్వేషణలో ఉన్నానని.. ప్రేరణ అరోరా, అంకితభావంతో కూడిన మా టీం ప్రపంచ స్థాయి సినిమా అనుభవాన్ని మీకు అందించేందుకు సిద్దంగా ఉందని ఇప్పటికే తెలియజేశాడు సుధీర్ బాబు.
Mr Bachchan | రవితేజ మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?
Trisha | త్రిష సెల్ఫీ.. ఎక్కడుందో క్యాప్షన్‌తో హింట్ ఇచ్చేసిందా..?
Maharaja | ప్లాట్‌ఫాం ఏదైనా రెస్పాన్స్ ఒక్కటే.. విజయ్ సేతుపతి మహారాజ ట్రెండింగ్