దాదాపు 8 ఏళ్లుగా యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నా కూడా గత ఏడాది కాలంలోనే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు షణ్ముఖ్ జస్వంత్. లాక్ డౌన్ సమయంలో ఈయన చేసిన సాఫ్ట్వేర్ డెవలపర్, సూర్య వెబ్ సిరీస్‌లు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ వెబ్ సిరీస్‌ల కారణంగా మనోడికి ఫ్యాన్ పాలోయింగ్ కూడా బాగానే పెరిగిపోయింది. 10 లక్షల లోపు ఉన్న సబ్స్క్రైబర్లు ఇప్పుడు 30 లక్షలకు చేరువలో ఉన్నారు. ఈ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది కాబట్టే ఈయనకు బిగ్‌బాస్ హౌస్ నుంచి పిలుపు వచ్చింది. త్వరలోనే మొదలు కాబోయే బిగ్‌బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ జస్వంత్‌కు కూడా ఆఫర్ వచ్చింది.
బిగ్‌బాస్ కోసం షణ్ముఖ్ జస్వంత్‌కు స్టార్ మా యాజమాన్యం మంచి పారితోషికం కూడా ఆఫర్ చేసింది. ఇంకా చెప్పాలంటే ఇప్పటివరకు మరే కంటెస్టెంట్‌కు ఇవ్వని విధంగా భారీ రెమ్యునరేషన్‌ను ఇవ్వడానికి సిద్ధమైంది స్టార్ మా యాజమాన్యం. అటూ ఇటుగా దాదాపు కోటి రూపాయల వరకూ పారితోషికం ఇవ్వబోతున్నట్లు ప్రచారం కూడా జరిగింది. దీనికి సంబంధించి చాలా వార్తలు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈయన బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లడం లేదని తెలుస్తోంది. దానికి కారణం కూడా పారితోషికం మరీ ఎక్కువగా డిమాండ్ చేయడమే అని వార్తలు వస్తున్నాయి.
తన రెమ్యూనరేషన్ విషయంలో షణ్ను బెట్టు చేస్తున్నాడని.. అడిగినంత ఇవ్వకపోతే బిగ్ బాస్ హౌస్‌కు వచ్చే ముచ్చటే లేదని షో నిర్వాహకులకు తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. మరీ అంత అయితే భరించలేమని.. ఒక్క కంటెస్టెంట్‌కు అంత రెమ్యునరేషన్ ఇస్తే వర్కౌట్ కాదని స్టార్ మా యాజమాన్యం కూడా ఈ కుర్రాడిపై ఆశలు వదిలేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈయన స్థానంలో మరో యూట్యూబ్ స్టార్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే తన తర్వాత వెబ్ సిరీస్ కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాడు షణ్ముఖ్ జస్వంత్. త్వరలోనే సినిమాల్లోకి కూడా వస్తాడని వార్తలు వస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో రానాకు అన్యాయం చేస్తున్నారా..?
సరికొత్త రికార్డులు సెట్ చేసిన మహేష్ బాబు
20 మిలియన్ల అభిమానాన్ని పొందిన రష్మిక
Prakash Raj Surgery | ప్రకాశ్ రాజ్‌కు సర్జరీ..అసలేం జరిగిందంటే..?