సఖి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది షాలిని (Shalini). కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar)ను పెండ్లి చేసుకున్న తర్వాత ఫ్యామిలీ లైఫ్‌తో బిజీ అయిపోయి, ఇటు సోషల్ మీడియాకు, అటు సినిమాలకు దూరమైపోయింది. కాగా అజిత్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది.
షాలిని తన ఫాలోవర్లు, అభిమానులతో టచ్‌లో ఉండేందుకు నెట్టింట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో జాయిన్ అయింది. షాలిని ఇన్‌స్టా హ్యాండిల్ @shaliniajithkumar2022. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే షామిలీ (షాలిని సోదరి) తన సోదరిని సోషల్ మీడియాలోకి స్వాగతం పలికింది. తక్కువ టైంలోనే షాలినికి ఫాలోవర్లు భారీగా వచ్చి చేరారు.
ఫిబ్రవరిలో షాలిని అజిత్ పేరు ట్విటర్లో ట్రెండింగ్ అయింది. అయితే ఈ అకౌంట్ నకిలీదిగా గుర్తించారు. షాలిని అజిత్ మేనేజర్ ఇది ఫేక్ ప్రొఫైల్ అని, ఆమె ట్విటర్ లో లేదని క్లారిటీ ఇచ్చారు. అజిత్‌కుమార్ ప్రస్తుతం హెచ్ వినోథ్ డైరెక్షన్లో తునివు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తునివు 2023 జనవరి రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Read Also : Gurthunda Seetakalam | గుర్తుందా శీతాకాలం నుంచి మరో క్రేజీ అప్డేట్ టైం ఫిక్స్
Read Also : Mahesh Babu | నాన్న నాకిచ్చిన గొప్ప బహుమానం అదే.. మహేశ్ బాబు స్పీచ్ వైరల్
Read Also : Orange | ఆరెంజ్ రీ రిలీజ్‌పై నిర్మాత నాగబాబు క్లారిటీ