Ghaati | బాహుబలి తర్వాత అనుష్కా శెట్టి (Anushka Shetty) కాంపౌండ్ నుంచి వస్తోన్న మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఘాటి (Ghaati). క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ప్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో చైతన్య రావ్, జగపతి బాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆసక్తిక వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రం కన్నడ పంపిణీ హక్కులను పాపులర్ కన్నడ స్టార్ హీరో తల్లి పుష్ప అరుణ్ కుమార్ సొంతం చేసుకుంది. ఈ మూవీని పుష్ప అరుణ్ కుమార్ తన కొత్త ప్రొడక్షన్ వెంచర్ పీఏ ఫిల్మ్స్ ద్వారా కన్నడలో విడుదల చేయనుంది. పుష్ప అరుణ్ కుమార్ కర్ణాటకలో ఇదే మొదటి రిలీజ్ కావడం విశేషం. ఘాటిలో అనుష్క యాక్టింగ్, రోమాలు నిక్కపొడుచుకునే విజువల్స్ ఇంప్రెసివ్‌గా అనిపించడంతో పుష్ప అరుణ్ కుమార్ ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఫిక్స్ అయిందట.
లేడీ ఓరియెంటెడ్ స్టోరీతో రాబోతున్న ఈ సినిమా పంపిణీ రంగంలోకి అడుగుపెట్టేందుకు తనకు పర్ఫెక్ట్ లాంచ్ ప్యాడ్ అని ఈ నిర్ణయం తీసుకున్నారట పుష్ప అరుణ్ కుమార్. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన జనాలంతా కొండ ప్రాంతం మధ్యలోని దారి వెంట మూటలు మోసుకొని వెళ్తున్న లుక్‌తోపాటు గ్లింప్స్, ట్రైలర్ సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఘాటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో పోస్ట్ థ్రియాట్రికల్ రిలీజ్ కానుంది.
Malayalam Actress | హోటల్‌కి రమ్మన్నాడు.. యువ రాజకీయ నాయకుడిపై ప్రముఖ నటి లైంగిక ఆరోపణలు
Naga Chaitanya-Sobitha | తిరుమలలో శోభిత చేయి విడవని నాగ చైతన్య.. ఫొటోల కోసం ఎగబడ్డ భక్తులు
Dragon | తారక్ డ్రాగన్ కోసం స్పెషల్ హౌస్ సెట్.. ప్రశాంత్ నీల్ అదిరిపోయే ప్లాన్..!
SSMB 29 | ఎస్ఎస్ఎంబీ 29 కోసం ఎస్ఎస్ రాజమౌళి కొత్త ప్రయోగం.. జంగిల్ సఫారీ రైడ్ అందుకేనా..?