టాలీవుడ్ (Tollywood)యంగ్ హీరో అక్కినేని అఖిల్ (Akhil Akkineni) ప్రస్తుతం ఏజెంట్ (Agent) సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. స్పై థ్రిల్లింగ్ కథాంశంతో వస్తున్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి (Surender Reddy) తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం యూరోపియన్ కంట్రీ హంగేరీలోని బుడాపెస్ట్ (Budapest )లో షూటింగ్ కొనసాగుతోంది. మాలీవుడ్ స్టార్ హీరో మమ్ముట్టి (Mammootty)ఈ మూవీలో ఆర్మీ అధికారిగా, అఖిల్ మెంటార్‌గా కనిపించనున్నాడని సమాచారం.
కాగా ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. మమ్ముట్టి పాత్ర షూటింగ్ పూర్తి చేశాడట. అంతేకాదు బుడాపెస్ట్ నుంచి కోచికి కూడా తిరిగొచ్చినట్టు టాక్. మరోవైపు అఖిల్ అక్కినేని, విదేశీ స్టంట్ మ్యాన్ పర్యవేక్షణలో యాక్షన్ ప్యాక్డ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తాజా సమాచారం. హై బడ్జెట్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ భామ సాక్షి వైద్య తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది.
అనిల్ సుంకర నిర్మిస్తున్న ఏజెంట్‌కు ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇటీవలే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
SS Rajamouli wish suryavanshi team | మొన్న అల్లు అర్జున్..నేడు రాజమౌళి
Samantha Super heroes | ఆ సూపర్ హీరోలకు సమంత సపోర్ట్..ఆసక్తిగా వెయిటింగ్
Keerthy Suresh Selfie | అందాల తారలతో కీర్తిసురేశ్ సెల్ఫీ
Rajasekhar Sankranthi race | సంక్రాంతి రేసులో రాజ ‘శేఖర్’..?