e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News స్టాండ‌ప్ రాహుల్ పేరుతో యంగ్ హీరో కొత్త చిత్రం

స్టాండ‌ప్ రాహుల్ పేరుతో యంగ్ హీరో కొత్త చిత్రం

స్టాండ‌ప్ రాహుల్ పేరుతో యంగ్ హీరో కొత్త చిత్రం

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ త‌రుణ్ స‌క్సెస్‌లు ప‌క‌ల‌రించ‌క‌పోయిన వ‌రుస సినిమాలు చేస్తూ పోతున్నాడు. మంచి హిట్ ఒక్క‌టైన దొరుకుతుందేమోన‌ని ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్న రాజ్‌త‌రుణ్‌ను స‌క్సెస్ అనేది ప‌ల‌క‌రించ‌డం లేదు. ఇటీవ‌ల ప‌వ‌ర్ ప్లే అనే సినిమాతో ప‌ల‌క‌రించిన కూడా అది నిరాశ‌ప‌ర‌చింది. ఆరు సంవ‌త్స‌రాల నుండి మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న రాజ్ త‌రుణ్ ప్ర‌స్తుతం త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు.

కెరీర్ ప్రారంభంలో ఉయ్యాలా జంపాల ,సినిమా చూపిస్తా మావ,కుమారి21ఎఫ్ సినిమాలతో అల‌రించిన రాజ్ త‌రుణ్ ఇప్పుడు ‘డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీస్’ అనే కాన్సెప్ట్ తో సినిమాలు సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం రాజ్ తరుణ్ హీరోగా ‘స్టాండప్ రాహుల్’ అనే సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకు ‘కూర్చుంది చాలు’ అనేది ట్యాగ్ లైన్. బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌లైన ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటుంది.’మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఫేమ్ వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను నందకుమార్ అబ్బీనేని – భరత్ మాగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
స్టాండ‌ప్ రాహుల్ పేరుతో యంగ్ హీరో కొత్త చిత్రం

ట్రెండింగ్‌

Advertisement