Deepika Padukone | అగ్ర కథానాయిక దీపికా పదుకొణె (Deepika Padukone), దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మధ్య కోల్డ్‌వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రభాస్‌తో సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తీయబోతున్న ‘స్పిరిట్’ (Spirit) చిత్రంలో కథానాయిగా దీపికను ముందుగా అనుకున్నారు. అయితే, అనూహ్యంగా ఆమెను తొలగించారు. ఆ తర్వాత తన సినిమాను లీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ సందీప్ రెడ్డి వంగా పెట్టిన ఓ పోస్ట్ చర్చకు దారి తీస్తోంది. ఈ పోస్ట్ దీపికను ఉద్దేశించే అంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఈ వివాదం వేళ దీపికా పదుకొణె తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న దీపిక.. జీవితంలో ఎదురయ్యే కష్టాలను (difficult situations) అధిగమిస్తూ తన నిర్ణయాలకు కట్టుబడి ఉండటం, దృఢంగా ముందుకు సాగడం గురించి మాట్లాడారు. ‘జీవితంలో బ్యాలెన్స్డ్గా ఉండాలంటే నిజాయితీ ముఖ్యం అని భావిస్తా. నేను దానికే ప్రాధాన్యం ఇస్తాను. కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు నా మనసు చెప్పిందే వింటాను. తర్వాతే నిర్ణయాలు తీసుకుంటాను. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాను’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దీపిక కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నిజస్వరూపం బయటపెట్టుకున్నావు
‘స్పిరిట్’లో తొలుత దీపికా పదుకొణెను కథానాయికగా అనుకున్నారు. దర్శకుడు సందీప్‌రెడ్డి ఆమెకు సినిమా కథ మొత్తం చెప్పారట. అయితే షూటింగ్ టైమింగ్స్, రెమ్యునరేషన్ విషయాల్లో దీపికా చేసిన డిమాండ్స్ సందీప్‌రెడ్డికి కోపం తెప్పించాయట. తాను కేవలం 6 గంటలు మాత్రమే పనిచేస్తానని, 30కోట్ల పారితోషికంతో పాటు అదనంగా జీఎస్టీ చెల్లించాలని, తనతో పాటు 20 మంది సిబ్బంది జీతభత్యాలను నిర్మాతలే చెల్లించాలని, వారికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని దీపిక డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. అందుకే ఆమెను సినిమా నుంచి తప్పించారని టాక్. ఈ నేపథ్యంలో సందీప్‌రెడ్డి చేసిన తాజా ట్వీట్ సంచలనంగా మారింది. పరోక్షంగా దీపికను ఉద్దేశించే ఆయన ఈ ట్వీట్ చేశారంటున్నారు.
‘అధికారికంగా ఒప్పందం చేసుకోకపోయినా.. కథ ఎవరికీ చెప్పొద్దనే నియమాన్ని పాటించాలి. నీపై నమ్మకంతో కథ మొత్తం చెప్పాను. కానీ నువ్వు కథను రివీల్ చేసి నీ నిజస్వరూపం ఏమిటో బయటపెట్టుకున్నావు. ఒక సినిమా కోసం కొన్నేళ్లు కష్టపడాలి. అది నీకు తెలియదు. అర్థం కాదు కూడా. అయినా భయపడేది లేదు. నువ్వు కథ మొత్తం చెప్పినా నాకేమి ఫరక్ పడదు’ అంటూ సందీప్‌రెడ్డి వంగా ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఓ బాలీవుడ్ వెబ్సైట్లో ‘స్పిరిట్’ తాలూకు కథ బయటికొచ్చింది. ఇంటిమేట్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని, అదొక ‘ఏ’ రేటెడ్ మూవీ అంటూ ఆ సైట్లో పేర్కొన్నారు. దీపికా వల్లే స్టోరీ రివీల్ అయిందని సందీప్ రెడ్డి భావించారని, అందుకే ఆగ్రహంగా ట్వీట్ చేశారని అంటున్నారు.
Also Read..
Ram Charan – Trivikram | రామ్ చరణ్ – త్రివిక్రమ్.. తెరపైకి కొత్త కాంబో?
Dipika Kakar | ప్రాణాంతక లివర్ క్యాన్సర్ బారిన పడిన ప్రముఖ నటి.. సోషల్ మీడియా ద్వారా పోస్ట్
Nana Patekar | రూ. 20 కోట్ల పారితోషికం.. SSMB29 ప్రాజెక్ట్‌ను రిజెక్ట్ చేసిన నానా పటేకర్.!