Dipika Kakar | ప్రముఖ టీవీ నటి దీపికా కాకర్ (Dipika Kakar) ప్రాణాంతక లివర్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న ఆమె ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయినప్పటికీ నొప్పి తగ్గకపోగా పెరుగుతోంది. దీంతో స్కానింగ్ చేయించుకోగా క్యాన్సర్‌గా తేలింది. లివర్‌లో టెన్నిస్ బాల్ సైజులో టూమర్ (tumour in the liver) ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆ కణితి ప్రమాదకర దశలో ఉందని పేర్కొన్నారు. స్టేజ్ 2 దశలో ఉన్న క్యాన్సర్‌గా వైద్యులు నిర్ధరించారు. ఈ విషయాన్ని నటి ఇన్‌స్టా స్టోరీస్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు.
‘గత కొన్ని వారాలుగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాం. నా కడుపు పైభాగంలో విపరీతమైన నొప్పి కారణంగా ఆసుపత్రి చుట్టూ తిరగాల్సి వచ్చింది. వైద్య పరీక్షల్లో కాలేయంలో టెన్నిస్ బాల్ పరిమాణంలో కణితిని వైద్యులు గుర్తించారు. ఆ కణితి ప్రమాదకర దశలో ఉంది. స్టేజ్ 2 దశలో ఉన్న క్యాన్సర్ (stage 2 cancer)గా వైద్యులు నిర్ధరించారు. ఈ ప్రాణాంతక లివర్ క్యాన్సర్‌ను ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాను. దైవబలం, అభిమానుల ఆశీర్వాదాలు, ఆదరణతో ఈ ప్రమాదాన్ని విజయవంతంగా అధిగమిస్తాను’ అని దీపికా కాకర్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు, అభిమానులు దీపిక కక్కర్ త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా గత నెల జమ్ము కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి నుంచి దీపిక కాకర్ ఫ్యామిలీ తృటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే. దీపికా కాకర్ (Dipika Kakar) తన భర్త షోయబ్ ఇబ్రహీం (Shoaib Ibrahim) గత నెల జమ్ముకశ్మీర్‌కు వెళ్లారు. అక్కడ బైసరాన్ వ్యాలీని కూడా సందర్శించారు. ఈ సందర్శన అనంతరం వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. వారు తమ వెకేషన్‌ను ముగించుకున్న కొన్ని గంటల్లోనే అక్కడ ఉగ్రదాడి జరిగింది. ఈ విషయాన్ని దీపికా-షోయబ్ జంట సోషల్ మీడియా ద్వారా పంచుకున్న విషయం తెలిసిందే.
Also Read..
Kamal Hassan | కన్నడ భాషపై కమల్ హాసన్ సంచలన కామెంట్స్.. మండిపడుతున్న కన్నడిగులు
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినిమాలో నటించనున్న చంద్రబాబు కోడలు.. !