Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తను కమిటైన సినిమాలు పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే హరిహర వీరమల్లు చిత్రం షూటింగ్ పూర్తి కాగా, ఈ మూవీని జూన్ 12న విడుదల చేయనున్నారు. రిలీజ్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ స్పీడ్ కూడా పెంచారు. ఇక హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి కాగానే ఓజీ సెట్లో అడుగుపెట్టారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కు కూడా గుమ్మడి కాయ కొట్టేయనున్నారు. రీసెంట్గా ఈ మూవీని దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ‘ఫైరింగ్ వరల్డ్ 25 సెప్టెంబరు 25’ అని సోషల్ మీడియాలో ఓజీ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేయగా, ఆ పోస్టర్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించింది.
డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఓజీ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తుండగా, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రలలో కనిపించి సందడి చేయనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఇందులో చంద్రబాబు నాయుడు తమ్ముడికి కాబోయే కోడలు నటి సిరి లేళ్ళ ఇందులో ముఖ్య పాత్ర చేయనుందట. త్వరలో నారా రోహిత్‌ని వివాహం చేసుకొని నారా కోడలిగా వెళ్లనున్న సిరి గతంలో నారా రోహిత్ నటించిన ప్రతినిధి-2 మూవీలో హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి అప్పటినుండి నారా రోహిత్, సిరి డేటింగ్ చేయసాగారు. అలా రీసెంట్ గానే వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే ఇటీవల నారా రోహిత్ తండ్రి మరణించడంతో ఈ పెళ్లి వాయిదా పడింది. అయితే సిరిలేళ్ల ప్రతినిధి 2 మూవీ తర్వాత మరో సినిమా చేసింది లేదు. కాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజీలో కీలక పాత్రలో కనిపించి సందడి చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై పూర్తి క్లారిటీ రావలసి ఉంది. ఇక నారా రోహిత్ గత కొద్ది రోజులుగా భైరవం ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. పలు ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటున్నారు. మరి ఏదైన ఇంటర్వ్యూలో తనకి కాబోయే భార్య ఓజీ చిత్రంలో నటిస్తుందా లేదా అనే దానిపై క్లారిటీ ఇస్తారా అనేది చూడాలి.