SS Rajamouli | గ్లోబల్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli), మహేశ్ బాబు (maheshbabu కాంబోలో వస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29 (SSMB 29) ఆఫ్రికన్ గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాలీవుడ్ స్టార్ యాక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పుడొక ఆసక్తిక వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది.
ఆగస్టు 9న మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఎస్ఎస్ఎంబీ 29 ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్మెంట్ ఉంటుందని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఎస్ఎస్ రాజమౌళి మాత్రం ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఈ ఏడాది నవంబర్‌లో రాబోతున్నట్టు ప్రకటించాడు. అయితే జక్కన్న ప్రత్యేకించి నవంబర్ అని చెప్పడానికి పెద్ద కారణమే ఉందట. ఇంతకీ అదేంటనుకుంటున్నారా..? హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ అవతార్ ప్రాంఛైజీలో తెరకెక్కిస్తున్న Avatar: The Fire and Ash డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ కోసం జేమ్స్ కామెరాన్ భారత్‌కు రానున్నాడు.
జేమ్స్ కామెరాన్ వచ్చే టైంనే తన ప్రమోషన్స్ కోసం వాడాలని ఫిక్స్ అయ్యాడట రాజమౌళి. అవును మీరు చదివింది నిజమే. జక్కన్న ఈ సారి ఏకంగా జేమ్స్ కామెరాన్‌తో ఎస్ఎస్ఎంబీ 29 ఫస్ట్ లుక్, గ్లింప్స్ లాంచ్ చేసేందుకు ప్లాన్ చేశాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటే పబ్లిసిటీ, ప్రమోషన్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఎస్ఎస్ఎంబీ 29 ఫస్ట్ గ్లింప్స్‌ను ఏకంగా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న జేమ్స్ కామెరాన్‌తో లాంచ్ చేయించి వరల్డ్ మూవీ లవర్స్ ఫోకస్‌ను తనవైపునకు తిప్పుకునేలా భారీ స్కెచ్ వేశాడని అర్థమవుతోంది. ఏదైనా ప్రమోషనల్ స్ట్రాటజీలో తనదైన మార్క్ చూపించే ఇండియన్ ఫిలిం డైరెక్టర్లలో జక్కన్న టాప్ 1లో ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.
Malayalam Actress | హోటల్‌కి రమ్మన్నాడు.. యువ రాజకీయ నాయకుడిపై ప్రముఖ నటి లైంగిక ఆరోపణలు
Naga Chaitanya-Sobitha | తిరుమలలో శోభిత చేయి విడవని నాగ చైతన్య.. ఫొటోల కోసం ఎగబడ్డ భక్తులు
Dragon | తారక్ డ్రాగన్ కోసం స్పెషల్ హౌస్ సెట్.. ప్రశాంత్ నీల్ అదిరిపోయే ప్లాన్..!
SSMB 29 | ఎస్ఎస్ఎంబీ 29 కోసం ఎస్ఎస్ రాజమౌళి కొత్త ప్రయోగం.. జంగిల్ సఫారీ రైడ్ అందుకేనా..?