SS Rajamouli | ఆధ్యాత్మిక యాత్రలో రాజమౌళి.. ఆలయాలు తిరుగుతున్న జక్కన్న
ఆస్కార్ అవార్డుల వేడుకల నేపథ్యంలో దాదాపు మూడు నెలలు విదేశాల్లో గడిపిన అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం విరామ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదిస్తున్నారు. గత నెల రోజులుగా తమిళనాడులోని సుందరమైన పర్యాటక ప్రాంతాల్లో సేద తీరుతున్న ఆయన ఇటీవలే అక్కడి ప్రఖ్యాత దేవాలయాలను సందర్శించారు.
SS Rajamouli | ఆస్కార్ అవార్డుల వేడుకల నేపథ్యంలో దాదాపు మూడు నెలలు విదేశాల్లో గడిపిన అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం విరామ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదిస్తున్నారు. గత నెల రోజులుగా తమిళనాడులోని సుందరమైన పర్యాటక ప్రాంతాల్లో సేద తీరుతున్న ఆయన ఇటీవలే అక్కడి ప్రఖ్యాత దేవాలయాలను సందర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్‌మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. ఈ ఆధ్యాత్మిక యాత్ర తనకు మరపురాని జ్ఞాపకాల్ని మిగిల్చిందని రాజమౌళి ఆనందం వ్యక్తం చేశారు. ‘రోడ్డు ట్రిప్ ద్వారా తమిళనాడులోని దేవాలయాలను సందర్శించాలన్నది నా కల.
గత నెలలో మా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీరంగం, బృహదీశ్వరాలయం, రామేశ్వరం, తూత్తుకుడి, మధురై దేవాలయాలను సందర్శించాం. ఇక్కడి దేవాలయాల్లోని శిల్పకళా నైపుణ్యం, అద్భుతమైన కట్టడాలు నన్ను మంత్రముగ్ధుణ్ణి చేశాయి. చోళ రాజులు కళలను ఎంతగా ప్రోత్సహించారో ఈ దేవాలయాలను చూస్తే అర్థమైంది. రామేశ్వరం, కుంభకోణంలోని హోటల్స్‌లో భోజనాన్ని కూడా ఎంతగానో ఆస్వాదించా’ అని రాజమౌళి వీడియోలో చెప్పారు. రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేష్‌బాబుతో తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పనుల్లో రాజమౌళి బిజీగా ఉన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

