‘నా జీవితంలో ‘బాహుబలి’ చేసిన మ్యాజిక్ ఎప్పటికీ మరిచిపోలేను. ఆ సిరీస్‌ని కొనసాగించమని చాలామంది అభిమానులు అడిగారు. వారందరికోసం ‘బాహుబలి : క్రౌన్ ఆఫ్ బ్లడ్’ని రూపొందించాం. తొమ్మిది ఎపిసోడ్స్‌తో ఈ నెల 17 నుంచి డిస్నీ, హాట్‌స్టార్ వేదికగా ఈ యానిమేషన్ సిరీస్ ప్రసారం కానుంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి.’ అని ఇన్‌స్టా వేదికగా ఓ వీడియో విడుదల చేశారు అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి.
ఇంకా ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ ‘ ‘ది లెజెండ్ ఆఫ్ హనుమాన్’కు పనిచేసిన గ్రాఫిక్ ఇండియాతో కలిసి దీన్ని రూపొందించాం. ఈ సిరీస్ తెలుగుతోపాటు ఆరు భాషల్లో అందుబాటులోకి రానుంది.’ అని తెలిపారు రాజమౌళి. ఇదిలావుంటే.. ప్రస్తుతం మహేశ్‌బాబుతో ఆయన పాన్‌వరల్డ్ సినిమా తీసే పనిలో ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నది.