Sruthi Hassan | ఇంట్లో దెయ్యం ఉందని భయపడిన శృతి హాసన్.. కదిలే బొమ్మతో వణికిపోయా అంటూ షాకింగ్ కామెంట్స్!
Sruthi Hassan | దెయ్యాలు, ఆత్మలు, అతీంద్రియ శక్తులు ఉన్నాయా? లేవా? అనే ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. పారానార్మల్ యాక్టివిటీస్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కథలు, అనుభవాలు ప్రచారంలో ఉన్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కొందరు తమ జీవితాల్లో ఎదురైన వింత సంఘటనలను పలు సందర్భాల్లో వెల్లడించారు.
Sruthi Hassan | దెయ్యాలు, ఆత్మలు, అతీంద్రియ శక్తులు ఉన్నాయా? లేవా? అనే ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. పారానార్మల్ యాక్టివిటీస్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కథలు, అనుభవాలు ప్రచారంలో ఉన్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కొందరు తమ జీవితాల్లో ఎదురైన వింత సంఘటనలను పలు సందర్భాల్లో వెల్లడించారు. తాజాగా ఈ జాబితాలో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కూడా చేరారు. తన ఇంట్లో ఓ బొమ్మ కారణంగా ఎదురైన భయానక అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ బొమ్మ తనకు నిద్రలేని రాత్రులను మిగిల్చిందని, చివరకు దాన్ని ఇంటి నుంచి బయటకు పంపించాల్సి వచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
తనకు ఎదురైన వింత అనుభవం గురించి శృతి హాసన్ మాట్లాడుతూ.. చెన్నైలోని తన ఇంట్లో కొన్ని సందర్భాల్లో ఏవో అదృశ్య శక్తులు ఉన్నట్లు అనిపించేదని చెప్పారు. అయితే ప్రతిసారీ ఇలాంటి అనుభవాలు ఎదురుకాలేదని, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వింత సంఘటనలు జరిగేవని వెల్లడించారు.తన దగ్గర మనిషి పరిమాణంలో ఉండే ఓ బొమ్మ ఉండేదని, దానికి ఫియోనా అని పేరు పెట్టుకున్నానని తెలిపారు. తన స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆ బొమ్మను పలకరించేవారని చెప్పారు. అంతేకాకుండా ఆ బొమ్మను అల్మారాలో పెట్టి దానిపై రకరకాల బొమ్మలు గీస్తూ ఉండేవారట. మొదట్లో అదొక సాధారణ బొమ్మగానే భావించినప్పటికీ, ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు తనను తీవ్రంగా భయపెట్టాయని శ్రుతి వివరించారు.
ఆ బొమ్మ విషయంలో తనకు ఎదురైన అత్యంత భయానక అనుభవాన్ని కూడా శ్రుతి హాసన్ వెల్లడించారు. ఎవరు ముట్టుకోకుండానే, ఎవరూ కదిలించకుండానే ఆ బొమ్మ ఒక చోటు నుంచి మరో చోటుకు మారిపోయేదని చెప్పారు. తాను దాన్ని ఒకచోట పెట్టిన తర్వాత మళ్లీ మరోచోట కనిపించడంతో చాలా ఆశ్చర్యపోయేదాన్నని తెలిపారు. ముఖ్యంగా ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇలాంటి సంఘటనలు ఎదురవడంతో తనకు భయం మరింత పెరిగిందని పేర్కొన్నారు. ఆ బొమ్మను ఎవరు కదుపుతున్నారు? అసలు అది ఒకచోటు నుంచి మరోచోటుకు ఎలా వెళ్తోంది? అనే విషయాలు తనకు అర్థమయ్యేవి కావని చెప్పారు. ఈ సంఘటనలు తనలో భయాన్ని పెంచడంతో ఇంట్లో ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి ఏర్పడిందని వివరించారు.
ఆ బొమ్మ కారణంగా భయాందోళనలకు గురైన తాను చివరకు ఆ భయాన్ని తగ్గించుకోవడానికి ఆధ్యాత్మిక మార్గాన్ని ఆశ్రయించినట్లు శ్రుతి తెలిపారు. ఇంట్లో హనుమాన్ చాలీసా ప్లే చేసేదాన్నని, చేతిలో ఉప్పు పట్టుకుని ప్రార్థనలు చేసేదాన్నని చెప్పారు. ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లు అనిపించడంతో దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నించానని వెల్లడించారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ బొమ్మ విషయంలో తన భయం తగ్గకపోవడంతో చివరకు దాన్ని ఇంటి నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నారట. అందులో భాగంగా ఆ బొమ్మను పూర్తిగా విడదీసి, దాని భాగాలను ఇంటి నుంచి బయటకు పంపించేశానని శ్రుతి వెల్లడించారు. బొమ్మను ఇంటి నుంచి తొలగించిన తర్వాత కూడా తనకు మనశ్శాంతి కలగాలని భావించి ఇంట్లో కొన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు శ్రుతి హాసన్ చెప్పారు. ఆ తర్వాత ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడిందని తెలిపారు. తన జీవితంలో జరిగిన ఈ సంఘటనలు అచ్చం ఓ హారర్ సినిమాలో చూసినట్లుగా అనిపించాయని పేర్కొన్నారు. శృతి హాసన్ చెప్పిన ఈ అనుభవం ప్రస్తుతం అభిమానులతో పాటు నెటిజన్లలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sruthi Hassan | ఇంట్లో దెయ్యం ఉందని భయపడిన శృతి హాసన్.. కదిలే బొమ్మతో వణికిపోయా అంటూ షాకింగ్ కామెంట్స్!
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని రామలింగం మౌన యాత్ర
Tummala Nageswara Rao | వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలువడం అసాధ్యం..! మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు
Errabelli Dayakar Rao | పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపులా?.. తొర్రూర్లో బీఆర్ఎస్ నాయకుల అరెస్టులపై ఎర్రబెల్లి ఫైర్
Thorrur | డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ప్రశ్నిస్తే అరెస్టులా?.. బీఆర్ఎస్ నేతలను అర్ధరాత్రి నుంచే అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

