వణికించే చలిలో పఠాన్ సాంగ్‌కు క్రేజీ మూమెంట్స్‌తో ఆకట్టుకున్నారు
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి కింగ్ ఖాన్‌కు గ్రేట్ కంబ్యాక్ మూవీగా మారింది.
న్యూఢిల్లీ : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి కింగ్ ఖాన్‌కు గ్రేట్ కంబ్యాక్ మూవీగా మారింది. ఈ మూవీలోని సాంగ్స్ ఇన్స్టంట్ హిట్‌గా మార్మోగుతుంటే సోషల్ మీడియాలో ఈ పాటలకు నెటిజన్లు తమదైన డ్యాన్స్ మూమెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
@iamsrk Germany has been dancing with you too. In minus degrees Celsius 😁 I hope you’ll visit again sometime. pic.twitter.com/sAaP2rrvus
— Maleika E. A. – srk1000faces 🇩🇪 (@srk1000faces) February 6, 2023
తాజాగా జర్మనీలో షారుక్ ఖాన్ ఫ్యాన్స్ ఝూమే జో పఠాన్ సాంగ్‌కు వణికించే చలిలో కిల్లర్ డ్యాన్స్ మూమెంట్స్‌తో పెర్ఫామ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వైరల్ క్లిప్ నటుడి దృష్టినీ ఆకర్షించింది. ఈ వీడియోను ఎస్ఆర్కే అభిమానుల్లో ఒకరు ట్విట్టర్లో షేర్ చేశారు. 43 సెకండ్ల నిడివితో కూడిన ఈ వీడియోలో హుషారైన ట్రాక్‌కు సబ్-జీరో ఉష్ణోగ్రతల్లో షారుక్ ఫ్యాన్స్ క్రేజీ మూమెంట్స్‌తో హోరెత్తించారు. సాంగ్‌లోని హుక్ స్టెప్‌ను ఈ గ్రూప్ యథాతథంగా పెర్ఫామ్ చేయడం ఆకట్టుకుంటుంది.
మైనస్ డిగ్రీ సెల్సియస్‌లో..మీరు మరోసారి విజిట్ చేస్తారని ఆశిస్తున్నానని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి 28,000 మందికి పైగా వీక్షించారు. తనకు దగ్గు, జలుబు, జ్వరం ఉన్నా ఈ గ్రూప్ డ్యాన్స్ ఆకట్టుకుందని ఓ యూజర్ కామెంట్ చేయగా వావ్ అంటూ మరో యూజర్ కామెంట్స్ సెక్షన్లో ప్రశంసలు గుప్పించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

