Indian Charles Sobhraj | దుల్కర్ సల్మాన్‌తో కురూప్ సినిమా తెరకెక్కించి సూపర్ హిట్టందుకున్నాడు మాలీవుడ్ డైరెక్టర్ శ్రీనాథ్ రాజేంద్రన్ (Srinath Rajendran) . ఈ టాలెంటెడ్ ఇప్పుడు బాలీవుడ్‌కు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. సూపర్ నట్వర్లాల్, ఇండియన్ చార్లెస్ శోభరాజ్ (Indian Charles Sobhraj) గా పాపులర్ అయిన మోసగాడు ధని రామ్ మిట్టల్ ( Dhani Ram Mittal) పై బయోగ్రఫికల్ క్రైం థ్రిల్లర్‌ను తెరకెక్కించనున్నాడు.
ధని రామ్ మిట్టల్ పట్టపగలు 1,000 కార్లను దొంగిలించడం, న్యాయమూర్తిలా నటించి 2,000 మందికి పైగా నేరస్థులను విడిపించడం, నకిలీ పత్రాలతో స్టేషన్‌మాస్టర్‌గా పని చేయడం లాంటి పనులతో పాపులర్ అయ్యాడు. ధని రామ్ మిట్టల్ ఏప్రిల్ 2024 లో మరణించాడు. ప్రీతి అగర్వాల్-చేతన్ ఉన్నియాల్ రాసిన మనీరామ్ పుస్తకం ఆధారంగా ఈ సినిమా రాబోతుంది. త్వరలోనే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై క్లారిటీ ఇవ్వనుంది టీం.
ఇన్సోమ్నియా మీడియా, కంటెంట్ సర్వీసెస్ లిమిటెడ్ ప్రెట్టీ పిక్చర్స్ తో కలిసి నిర్మించనున్న ఈ చిత్రాన్ని హిందీలో షూట్ చేయనున్నారు. ఆ తర్వాత మలయాళం, తెలుగుతోపాటు ఇతర భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ 2025లో సెట్స్‌పైకి వెళ్లనుంది.
Priyadarshi | సారంగపాణి జాతకం సెట్స్‌లో కేక్ కట్ చేసిన ప్రియదర్శి.. స్పెషల్ ఇదే