ఏగన్, ‘కోర్ట్’ఫేం శ్రీదేవి, ఫెమినా జార్జ్ ప్రధానపాత్రధారులుగా ఓ చిత్రం రూపొందుతున్నది. ఇంకా పేరు నిర్ధారించని ఈ చిత్రానికి యువరాజ్ చిన్నసామి దర్శకుడు. విజన్ సినిమా హౌస్ పతాకంపై డా.డి.అరుళనందు, మాథ్యూయో అరుళనందు ఈ చితాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఆదివారం వెలువడింది.
కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను అందించాలనే ఉద్దేశంతో తాము ముందుకెళ్తున్నామని, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మిస్తామని, తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా ఈ సినిమా రూపొందుతున్నదని నిర్మాతలు తెలిపారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు. బేబీ, కోర్ట్ చిత్రాల సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు సంగీతాన్నందిస్తున్నారు.