Samajavaragamana Movie Teaser | ఫలితం ఎలా ఉన్నా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకోవడంలో శ్రీవిష్ణు ముందు వరుసలో ఉంటాడు. జయాపజాయలతో సంబంధంలేకుండా ప్రేక్షకులకు కొత్త తరహా కథలను పరిచయం చేస్తుంటాడు. కెరీర్ మొదటి నుండి శ్రీవిష్ణు విభిన్న జానర్లో సినిమాలను చేస్తూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గత కొంత కాలంగా శ్రీవిష్ణు సినిమాలు కమర్షియల్‌గా హిట్లు కాలేకపోతున్నాయి. గతేడాది రిలీజైన ‘అల్లూరి’ కూడా మొదట పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. కానీ కమర్షియల్ ఫేయిల్యూర్‌గా మిగిలింది. ప్రస్తుతం శ్రీవిష్ణు ఆశలన్నీ ‘సామజవరగమన’ సినిమాపైనే ఉన్నాయి. ‘వివాహా భోజనంబు’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలో చిత్రబృందం ఇప్పటి నుంచి ప్రమోషన్లు స్టార్ట్ చేసింది. ఇక ప్రమోషన్లో భాగంగా మేకర్స్ తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్ మొత్తం హాస్యంతో నిండిపోయింది. భళా తందనాన, అల్లూరి వంటి నాన్ వెజ్ సినిమల తర్వాత మళ్లీ శ్రీవిష్ణు తన కంఫర్ట్ జానర్లోకి వచ్చినట్లు తెలుస్తుంది. కాలేజ్ డేస్‌లో తను ప్రేమించిన అమ్మాయి రాఖీ కట్టిందని.. తనను ప్రేమించిన అమ్మాయిలందరితో బలవంతం రాఖీ కట్టించుకోవడం కాస్త కొత్తగా అనిపిస్తుంది. ఒకప్పుడు రాఖీ అంటే ఎమోషనల్ ఫెస్టివల్, కానీ దానని మీ ఆడాళ్లందరూ కలిసి కమర్షియల్ ఫెస్టివల్ చేసేశారు అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. కులమే తన బలం, బలహీనత అనుకునే వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కూడా సినిమాలో హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తుంది.
మొత్తంగా టీజర్‌తో సినిమా నవ్వులు పంచబోతుందని స్పష్టం అయింది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ కాస్త బజ్‌ను క్రియేట్ చేయగా.. ఇప్పుడు టీజర్ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విష్ణుకు జోడీగా బిగిల్ ఫేమ్ రెబా మోనికా జాన్ నటిస్తుంది. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. గోపి సుందర్ స్వరకల్పనలో రూపొందుతున్న ఈ సినిమా వేసవిలో హాస్యపు విందులు వడ్డించడానికి ముస్తాబువుతుంది.