Mathu Vadalara 2 | క్రైం కామెడీ నేపథ్యంలో వచ్చిన చిత్రం మత్తు వదలరా (Mathu Vadalara). రితేశ్ రానా (డెబ్యూ) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీ సింహా (Sri Simha), సత్య, నరేశ్ అగస్త్య లీడ్ రోల్స్‌లో నటించారు. 2019లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడీ మరోసారి ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడానికి సీక్వెల్‌తో వస్తున్నట్టు తెలియజేస్తూ సస్పెన్స్ అప్డేట్ అందించింది శ్రీసింహా టీం.
ఎలాంటి షూటింగ్ అప్డేట్ లేకుండానే మత్తు వదలరా 2 (Mathu Vadalara 2). రిలీజ్ అప్డేట్ ఇచ్చి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నారు మేకర్స్. సీక్వెల్‌ను సెప్టెంబర్ 13న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఫస్ట్ పార్టుకు వచ్చిన స్పందనతో సీక్వెల్‌కు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలున్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. భారీ నేరాలు. అధిక వాటాలు… భారీ నవ్వులు అంటూ విడుదల చేసిన పోస్టర్లు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఫస్ట్ పార్ట్‌లో కనిపించిన మేల్ లీడ్ రోల్స్ సీక్వెల్లో కూడా కొనసాగనుండగా.. రెండో పార్టులో ఫరియా అబ్దుల్లా ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న సీక్వెల్ ప్రాజెక్ట్‌కు కాల భైరవ మరోసారి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
The Gang is back to intoxicate you with high doses of comedy 💥💥
Bigger crimes. Higher stakes. Louder laughs 💥💥💥#MathuVadalara2 in cinemas on 13th September, 2024 ❤️🔥
A @RiteshRana sequel.#MV2 @Simhakoduri23 #Satya @kaalabhairava7 @ClapEntrtmnt @MythriOfficial pic.twitter.com/04hNaRftSD
— BA Raju’s Team (@baraju_SuperHit) August 26, 2024
Sikandar | సల్మాన్ ఖాన్ సికిందర్ మారథాన్ షెడ్యూల్ షురూ.. ఎక్కడంటే..?
Priyadarshi | సారంగపాణి జాతకం సెట్స్‌లో కేక్ కట్ చేసిన ప్రియదర్శి.. స్పెషల్ ఇదే
Game Changer | ఫైనల్‌గా రాంచరణ్ గేమ్‌ఛేంజర్ విడుదల తేదీపై క్లారిటీ.. ఎప్పుడో తెలుసా..?
Saripodhaa Sanivaaram | సరిపోదా శనివారం ప్రీ సేల్స్.. నాని తన రికార్డు తానే బ్రేక్ చేస్తాడా..?