Sri Simha Koduri | మత్తు వదరలా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇంట్రీ ఇచ్చాడు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి రెండో కుమారుడు శ్రీసింహా కోడూరి (Sri Simha Koduri). ఈ యువ నటుడు డిఫరెంట్ పాత్రలతో ప్రొఫెషనల్‌గా తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. కాగా శ్రీసింహా వ్యక్తిగత జీవితంలో కీలక ముందడుగు వేశాడు.
శ్రీసింహా ప్రముఖ సీనియర్ నటుడు మురళీ మోహన్ మనవరాలు రాగ మాగంటి (Raga Maganti)తో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. వీరిది డెస్టినేషన్ వెడ్డింగ్ కాగా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని Ras Al Khaimahలో డిసెంబర్ 14న రాత్రి పెళ్లివేడుక గ్రాండ్‌గా జరిగింది. వెడ్డింగ్‌కు స్నేహితులు, కుటుంబసభ్యులు, ఇండస్ట్రీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
యమదొంగ, మర్యాద రామన్న సినిమాలతో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన శ్రీసింహా.. ఆ తర్వాత సోలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. చివరగా ఈ ఏడాది మత్తువదలరా 2తో మరోసారి హిట్టందుకున్నాడు. కొత్త సినిమా ప్రకటించాల్సి ఉంది. వెడ్డింగ్‌కు ముందు స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. పెళ్లి ఫొటోలు బయటకు రావాల్సి ఉంది.
Ghaati | అనుష్క-క్రిష్ ఘాటి టీం ఎక్జయిటింగ్ అనౌన్స్మెంట్ టైం ఫిక్స్
Vishnu Manchu | హాలీవుడ్ స్టార్ విల్స్మిత్తో మంచు విష్ణు.. క్రేజీ వార్త వివరాలివే..!