Sreeleela | కోలీవుడ్ స్టార్ యాక్టర్ అజిత్‌కుమార్ ఓవైపు సినిమాలతో ఎంటర్టైన్ చేయడమే కాదు.. మరోవైపు రేసింగ్ ట్రాక్‌పై దూసుకుపోతూ స్పోర్ట్స్ లవర్స్‌లో కూడా జోష్ నింపుతుంటాడని తెలిసిందే. రేసింగ్‌లో ఎప్పటికప్పుడు కొత్త రికార్డ్సు క్రియేట్ చేస్తూ నెట్టింట టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంటాడు అజిత్ కుమార్.
ఈ స్టార్ యాక్టర్ ప్రస్తుతం మలేషియా సెపంగ్ రేస్ ట్రాక్‌లో పాల్గొన్నాడు. ఈవెంట్‌కు శ్రీలీల, డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీలీల-అజిత్ కుమార్‌తో కలిసి సెల్ఫీ దిగింది. దీనికి సంబంధించిన విజువల్స్, స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అజిత్ కుమార్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించబోతున్న ఏకే 64 (AK64) మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది.
సిల్వర్ స్క్రీన్‌పై మెరువబోయే ఈ స్టార్ యాక్టర్లు రేసింగ్ ఈవెంట్లో కలిసి కనిపించడంతో అక్కడే ఉన్న కెమెరాలన్నీ క్లిక్ మనిపించాయి. సిల్వర్ స్క్రీన్ కంటే ముందే శ్రీలీల, అజిత్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు, మూవీ లవర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఏకే 64 (AK64) చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందని తెలిసిందే. గుడ్ బ్యాడ్ అగ్లీ, విదాముయార్చి సినిమాల తర్వాత అజిత్‌కుమార్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో ఏకే 64పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Actress #Sreeleela Taking Selfie With #AjithKumar🤳#AK64 pic.twitter.com/DO0D95z749
— Prakash (@prakashpins) December 13, 2025
Oru vela irukumo 🤔💥✅ #AK64@Adhikravi#AjithKumar #Sreeleela pic.twitter.com/hN0vybG7ah
— Thangapandian (@Thangapandi8759) December 13, 2025
Actor Pragathi | నా పూజల వలనే మెడల్స్ గెలిచింది.. నటి ప్రగతి పతకాలపై వేణు స్వామి కామెంట్స్
Akhanda 2 | బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ‘అఖండ 2’.. బాలయ్య మాస్ తుపానుకి తొలి రోజు ఫుల్ కలెక్షన్స్
Lionel Messi | ఒకచోట ఇద్దరు దిగ్గజాలు.. మెస్సీని కలిసిన షారుఖ్ ఖాన్.. వీడియో