Sreeleela | ఈ వారం విడుదలవుతున్న కొత్త సినిమాల్లో ‘జూనియర్’ ఒక్కటే కొంచెం హైప్ సృష్టించిన ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రం విషయంలో బడ్జెట్ పరంగా ఏ మాత్రం కాంప్రమైజ్ కాలేదు. చిన్న సినిమా అనిపించకూడదనుకున్నట్లే స్టార్ హీరోయిన్ శ్రీలీలను హీరోయిన్గా తీసుకుని, ఆమెకు రెండు కోట్లకుపైగా రెమ్యునరేషన్ ఇచ్చినట్లు టాక్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, జెనీలియా ముఖ్య పాత్ర, కె.కె. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం వంటి టాప్ టెక్నీషియన్లతో మేకర్స్ భారీ స్థాయిలో ప్రాజెక్ట్‌ను రూపొందించారు.
బడ్జెట్ పరంగా చూస్తే ఇది అస్సలు లాంచింగ్ మూవీ అని ఎవరు అనుకోరు. ఇక తెలుగు మార్కెట్‌పై కిరీటి స్పెషల్ ఫోకస్ పెడుతున్నాడు. ఇంటర్వ్యూలు, ప్రమోషన్స్ ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాడు. “వైరల్ వయ్యారి” పాటకు వచ్చిన రెస్పాన్స్‌తో ఓ స్థాయిలో హైప్ ఏర్పడినప్పటికీ, అది బాక్సాఫీస్‌కి ట్రాన్స్ఫర్ కావాలంటే పాజిటివ్ టాక్ తప్పనిసరి.ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ కావడం సవాలుగా మారింది. ఆ సినిమాను చూసేందుకు ఫిక్స్ అయిన ఆడియన్స్ ‘జూనియర్’పై ఆసక్తి చూపకపోవచ్చు. టాక్, రివ్యూస్ మౌత్ టాక్ వంటివి యంగ్ హీరో కిరీటి తొలి సినిమాకు బెంచ్ మార్క్ అవుతాయి.
కన్నడలో శివరాజ్ కుమార్‌ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి తీసుకురావడం బాగా పనిచేసింది. ఇప్పుడు తెలుగు ఈవెంట్‌కు రాజమౌళి రావడంతో కూడా క్రేజ్ బాగానే వచ్చింది. ఇక ఈ వేదికపై శ్రీలీల, దేవి శ్రీ ప్రసాద్, జెనీలియా, సుమ కలిసి డ్యాన్స్‌లు చేసి తెగ రచ్చ చేశారు. ముఖ్యంగా జెనీలియా చేసిన సందడి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. మధ్య మధ్యలో తనకి నచ్చిన స్టైల్లో స్టెప్పులు వేస్తూ అబ్బురపరిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, జూనియర్ చిత్రం జులై 18న భారీ ఎత్తున విడుదల కానున్న విషయం తెలిసిందే.