విజయాల సంగతి పక్కనపెడితే.. అవకాశలపరంగా మాత్రం భారీ ఆఫర్లతో దూసుకుపోతున్నది అచ్చ తెలుగందం శ్రీలీల. ప్రస్తుతం ఈ భామ తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఉంది. హిందీలో కూడా రెండు పెద్ద చిత్రాల్లో నటిస్తున్నది. ఇదిలావుండగా ఇటీవలే ఈ భామ రష్మిక మందన్న నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ని వీక్షించింది. రష్మిక మందన్న పోషించిన భూమి పాత్ర తన హృదయాన్ని కదిలించిందని, భావోద్వేగాల్ని ఆపుకోలేకపోయానని సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘సాధారణంగా నేను సినిమాలపై పెద్దగా స్పందించను.
కానీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చూశాక నా మనోభావాల్ని తప్పకుండా పంచుకోవాలనిపించింది. భూమి పాత్రలో రష్మిక నటన మనందరి హృదయాల్ని కదిలిస్తుంది. తన బాధను మనం కూడా ఫీలవుతాము. భూమి పడే సంఘర్షణ ప్రతి మహిళ జీవితంలో కనిపిస్తుంటుంది. రష్మిక నటనను పొగడటానికి మాటలు చాలడం లేదు’ అని శ్రీలీల పేర్కొంది. ఈ పోస్ట్‌పై రష్మిక మందన్న స్పందించింది. లవ్ ఎమోజీలతో శ్రీలీలకు కృతజ్ఞతలు తెలిపింది.