శ్రీవిష్ణు, రీతూవర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘శ్వాగ్’. హసిత్‌గోలి దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని వేగవంతం చేశారు. శనివారం ‘ఇంగ్లాండు రాణి..’ అంటూ సాగే మూడో గీతాన్ని విడుదల చేశారు. వివేక్‌సాగర్ స్వరపరచిన ఈ గీతాన్ని స్వరూప్ గోలి రచించారు.
కైలాష్‌ఖేర్ ఆలపించారు. ఈ పాటలో కథానాయిక రీతూవర్మ లుక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిదని, శ్రీవిష్ణు నాలుగు గెటప్స్‌లో కనిపిస్తారని, నాయిక రీతూవర్మ మహారాణి పాత్రలో అలరిస్తుందని చిత్ర బృందం పేర్కొంది. మీరా జాస్మిన్, దక్ష నగార్కర్, శరణ్య ప్రదీప్, సునీల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌సాగర్, రచన-దర్శకత్వం: హసిత్ గోలి.