Samajavaragamana | సినిమా హిట్టవుతుందా..ఫ్లాపవుతుందా..? అని సంబంధం లేకుండా కేవలం కథను నమ్మి సినిమాలు చేసే హీరోల జాబితాలో టాప్‌లో ఉంటాడు శ్రీవిష్ణు (Sree Vishnu). ప్రస్తుతం శ్రీవిష్ణు సామజవరగమన (Samajavaragamana) సినిమాలో నటిస్తున్నాడు. వివాహ భోజనంబు ఫేం రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే మేకర్స్ లాంఛ్ చేసిన గ్లింప్స్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
తాజాగా ఈ మూవీ టీజర్ అప్డేట్ అందించారు మేకర్స్. రేపు ఉదయం 11:07 గంటలకు సామజవరగమన టీజర్‌ను లాంఛ్ చేయనున్నట్టు తెలియజేశారు. హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్ ఈవెంట్‌కు వేదిక కానుంది. శ్రీవిష్ణు, నరేశ్ దండం పెడుతూ మాట్లాడుకుంటున్న స్టిల్‌తో టీజర్ అప్డేట్ అందించారు. సినిమా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా పక్కా ఫన్ రైడ్‌తో ఉండబోతున్నట్టు తెలిసిపోతుంది.
ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన వాట్ టు డు (What to do Song) సాంగ్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో బిగిల్ ఫేం రెబా మోనికా జాన్ (Reba Monica John) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.వెన్నెల కిశోర్, నరేశ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేశ్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతేడాది భళా తందనాన, అల్లూరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు శ్రీవిష్ణు. ఈ సారి సామజవరగమన సినిమాతో ఎలాంటి బ్రేక్ అందుకుంటాడనేది చూడాలంటున్నారు సినీ జనాలు.
Memu ready, Mari meeru..?🤩
The Hilarious #Samajavaragamana Teaser releasing TOMORROW👍
📍 @amb_cinemas
⏰ 11:07AMGet ready to be entertained😃@sreevishnuoffl @Reba_Monica @RamAbbaraju @AKentsOfficial @AnilSunkara1 @RajeshDanda_ @GopiSundarOffl @ChotaKPrasad pic.twitter.com/V9OLVwZniU
— Hasya Movies (@HasyaMovies) April 26, 2023
గ్లింప్స్ వీడియో..
What to do Song సాంగ్..
What to do Song సాంగ్ మేకింగ్ వీడియో ..
Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ నయా అప్డేట్
VS 11 | కోరమీసంతో విశ్వక్ సేన్.. కొత్త సినిమా VS 11 లాంఛ్
Samantha | సమంతకు సరికొత్త కానుక సిద్ధం చేసిన అభిమాని.. ఏకంగా ఇంట్లోనే గుడి