Samantha | సమంతకు సరికొత్త కానుక సిద్ధం చేసిన అభిమాని.. ఏకంగా ఇంట్లోనే గుడి
Samantha | స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గతేడాది తాను మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డట్లు ప్రకటించగానే అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. సమంత త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించిన వీరాభిమానుల్లో సందీప్ (Sandeep) ఒకడు.
Samantha | సాధారణంగా హీరోహీరోయిన్లకు అభిమానులుండటం సహజమే.. కానీ కొంతమందికి మాత్రం వీరాభిమానులుంటారు. ఎంతలా అంటే తమ అభిమాన నటీనటులకు ఏ మాత్రం కష్టమొచ్చినా తట్టుకోలేరు. ఆ కష్టాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనవుతుంటారు. ఇటీవలే ఇలాంటి పరిస్థితులు స్టార్ హీరోయిన్ సమంత (Samantha) విషయంలో కనిపించాయి. అందుకు కారణమేంటనేది ఊహించే ఉంటారు. గతేడాది తాను మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డట్లు సమంత ప్రకటించగానే అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
సమంత త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించిన వీరాభిమానుల్లో సందీప్ (Sandeep) ఒకడు. అయితే వ్యాధి బారి నుంచి మెల్లమెల్లగా బయట పడి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది సామ్. తన అభిమాన నటి సమంత ఎప్పటిలాగే ప్రొఫెషనల్‌గా బిజీ అవడంతో సందీప్ సంతోషంలో ఎగిరిగంతేస్తున్నాడు. ఈ అభిమాని ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా ఆలపాడు వాసి. ఈ నెల 28న సమంత పుట్టినరోజు జరుపుకోనున్న నేపథ్యంలో.. ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయే విలువైన బహుమతి ఏదైనా ఇవ్వాలనుకున్నాడు.
తన అభిమాన నటిపై ఉన్న గౌరవాన్ని చాటుకునేందుకు సందీప్ ఏకంగా తన ఇంటిలోనే సమంత విగ్రహం తయారు చేయించి గుడి కడుతున్నాడు. సమంతకు సందీప్ గుడి కట్టడమే కాదు.. మయోసైటిస్ నుంచి కోలుకున్న సందర్భంగా తిరుపతి, చెన్నై, నాగపట్నం, కడప దర్గా దైవ క్షేత్రములకు మొక్కుబడి యాత్ర నిర్వహించినట్టు తెలిపాడు. సమంతకు సరికొత్త కానుకను సిద్దం చేస్తున్న సందీప్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Samantha1
Read Also :
Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ నయా అప్డేట్
VS 11 | కోరమీసంతో విశ్వక్ సేన్.. కొత్త సినిమా VS 11 లాంఛ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

