టాలీవుడ్ (Tollywood) యంగ్ హీరో నితిన్ (Nithiin) ప్రస్తుతం మాచెర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఎడిటర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి (MS Raja Shekhar Reddy)దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే నితిన్ చేయబోయే కొత్త సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీతో నితిన్ నెక్ట్స్ ప్రాజెక్టు ఉండబోతుందని టాక్ నడుస్తోంది. కాగా ఈ చిత్రంలో బెంగళూరు బ్యూటీ, పెళ్లిసందD ఫేం శ్రీలీల (Sree Leela)ఫీ మేల్ లీడ్ రోల్లో నటించనుందట.
పక్కా ఎంటర్ టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి జూనియర్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని ఇన్ సైడ్ టాక్. కాగా తన అందం, అభినయం, డ్యాన్సింగ్ స్కిల్స్ తో ఆకట్టుకుంటున్న శ్రీలీలను నితిన్‌కు జోడీగా ఫైనల్ చేయనున్నట్టు తెలుస్తోండగా..త్వరలోనే దీనిపై ఓ ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ లేకపోలేదంటున్నారు సినీ జనాలు. నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌పై నిర్మించబోతున్న ఈ చిత్రం ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని ఇన్సైడ్ టాక్.
హరీష్ జైరాజ్ తాజా చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. మరోవైపు శ్రీలీల ప్రస్తుతం రవితేజతో కలిసి ధమాకా చిత్రంలో నటిస్తోంది. స్పెయిన్ లో షూటింగ్ జరుపుకుంటోంది.