BTown Couples First Holi | బీటౌన్ కపుల్స్ కు ఈ హోలీ చాలా స్పెషల్
ప్రతీ ఏడాది హోలీ వేడుకలు జరుగుతూనే ఉంటాయి. ఈ హోలీ సెలబ్రేషన్స్ యేటా కొందరికి స్పెషల్‌గా ఉంటాయి. కొందరు బీటౌన్ కపుల్స్ (BTown Couples) కు ఈ హోలీ చాలా స్పెషల్ అనే చెప్పాలి.
దేశవ్యాప్తంగా హోలీ సంబరాల్లో (Holi Celebrations) మునిగితేలేందుకు చిన్నాపెద్దా తేడా లేకుండా రెడీ అవుతున్నారు. రంగుల హోలీని ఫుల్ ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రతీ ఏడాది హోలీ వేడుకలు జరుగుతూనే ఉంటాయి. ఈ హోలీ సెలబ్రేషన్స్ యేటా కొందరికి స్పెషల్‌గా ఉంటాయి. కొందరు బీటౌన్ కపుల్స్ (BTown Couples) కు ఈ హోలీ చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఇంతకీ ఆ కపుల్ ఎవరనుకుంటున్నారా..? తొలిసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన బీటౌన్ సెలబ్రిటీ కపుల్.

Katrina Kaif-Vicky Kaushal | కత్రినాకైఫ్-విక్కీ కౌశల్
గతేడాది డిసెంబర్ లో పెళ్లి చేసుకుని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. రాజస్థాన్‌లోని పోర్టులో గ్రాండ్ వెడ్డింగ్ ఈవెంట్లో ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. కలర్ ఫుల్ హోలీ సెలబ్రేషన్స్ తో ఫాలోవర్లలో జోష్ నింపనున్నారు విక్కీ-కత్రినా.

Farhan Akhtar-Shibani Dandekar | ఫర్హాన్ అఖ్తర్-శిబానీ దండేకర్
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక్కటైంది ఈ జంట. ఏడేళ్ల డేటింగ్ తర్వాత గొప్ప ముందడుగు వేశారు. ఖండాలాలో ఏర్పాటు చేసిన వెడ్డింగ్ ద్వారా ఇంటివారయ్యారు. వీళ్లు హోలీ వేడుకలతో అందరికీ ట్రీట్ ఇవ్వుబోతున్నారట.

Rajkummar Rao -Patralekhaa | రాజ్‌కుమార్ రావు-పత్రలేఖ
విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్ రాజ్‌కుమార్ రావు. పత్రలేఖతో సుమారు దశాబ్దకాలానికి పైగా డేటింగ్ తర్వాత గతేడాది నవంబర్‌లో అందమైన సెర్మనీలో స్నేహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఒక్కటయ్యారు.

Yami Gautam – Aditya Dhar | ఆదిత్యాధర్-యామీ గౌతమ్
యురి..ది సర్జికల్ స్ట్రైక్ ఫేం డైరెక్టర్ ఆదిత్యాధర్, హీరోయిన్ యామీ గౌతమ్ గతేడాది జూన్‌లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ కొత్త జంట ఈ సారి హోలీ వేడుకలతో సందడి చేయనుంది.

Aditya Seal-Anushka Ranjan | ఆదిత్యాసీల్-అనుష్క రంజన్
లవ్ బర్డ్స్ ఆదిత్యాసీల్-అనుష్క రంజన్ గతేడాది నవంబర్ లో ఓ ఇంటివారయ్యారు. వీరు కూడా రంగుల హోలీని స్పెషల్ గా జరుపుకునేందుకు రెడీ అంటున్నారు.

Vikrant Massey-Sheetal Thakur | విక్రాంత్ మెస్సీ-శీతల్ ఠాకూర్
ఏడేళ్ల డేటింగ్ అనంతరం విక్రాంత్-శీతల్ పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరూ అప్ కమింగ్ సినిమా Gaslight సెట్స్ లో జాయిన్ కానున్నారు. సోమ్‌నాథ్ టెంపుల్‌ను సందర్శించనున్నారు. వీరిద్దరూ పెళ్లి తర్వాత హోలీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

