థియేటర్స్‌లోనే ‘SR కళ్యాణమండపం’ రిలీజ్
థియేటర్స్ లో కళ్యాణమండపం ఏంటి అనుకుంటున్నారా..? ఇదే సినిమా టైటిల్ మరి. SR కళ్యాణమండపం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు కుర్ర హీరో కిరణ్ అబ్బవరం.

థియేటర్స్ లో కళ్యాణమండపం ఏంటి అనుకుంటున్నారా..? ఇదే సినిమా టైటిల్ మరి. SR కళ్యాణమండపం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు కుర్ర హీరో కిరణ్ అబ్బవరం. ఈయన గతంలో రాజావారు రాణిగారు సినిమాలో నటించాడు. ఎలైట్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రమోద్ – రాజు నిర్మాతలుగా.. నూతన దర్శకుడు శ్రీధర్ గాదే తెరకెక్కించిన సినిమా ‘ SR కళ్యాణమండపం’ EST 1975. టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జవాల్కర్ ఇందులో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ దగ్గర నుంచి అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అసక్తిని క్రియేట్ చేసుకుంది.
ఆ ఉత్కంఠని మరింత పెంచుతూ ఆ తరువాత విడుదల చేసిన చుక్కల చున్ని, చూసాలే కళ్లార వంటి పాటలు యూట్యూబ్ లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ తెచ్చుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో సైతం ట్రెండ్ అవుతున్నాయి. వీటితో పాటే విడుదల చేసిన టీజర్ కి సైతం అంతటా అనూహ్య స్పందన లభించడమే కాకుండా, టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో SR కళ్యాణమండపం EST 1975 చిత్రం హాట్ టాపిక్‌గా మారడం విశేషం. ఇటీవలే SR కళ్యాణమండంపం EST 1975 చిత్రాన్ని మాత్రం థియేటర్ లో విడుదల చేస్తున్నామంటూ అధికారికంగా ప్రకటించడమే కాకుండా అందుకు తగ్గట్లుగా నిర్మాతలు ప్రమోద్ – రాజులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల కింద శంకర్ పిక్చర్స్ వాళ్ళు ఈ చిత్రానికి సంబంధించిన వరల్డ్ వైడ్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్నారు.
ఇక ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సైతం కిరణ్ అబ్బవరం అందించడం విశేషం. విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని దర్శకుడు శ్రీధర్ గాదే తెలిపారు. ఈ సినిమాను ఆగస్ట్ 6న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.
ఇవి కూడా చదవండి..
ఆస్పత్రిలో నయనతార తండ్రి..కూతురి పెళ్లి కోరిక తీరేనా..?
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!
ఐటెంసాంగ్ తో సన్నీలియోన్ సందడి
బీచ్‌లో పూజాహెగ్డే..ఎక్కడికి వెళ్లిందో..?
యూట్యూబ్‌లో అజిత్ ‘వలిమై’ రికార్డుల మోత
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

