లేడీ సూపర్ స్టార్ నయనతార కొన్నేళ్లుగా కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ తో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ లవ్ బర్ట్స్ పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ చాలా సార్లు వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే పెళ్లి మాత్రం వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. కానీ ఈ సారి మాత్రం నయనతార తప్పకుండా పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీనిక్కారణం నయనతార తండ్రి ఆస్పత్రిలో చేరడమేనట.
కోలీవుడ్ సర్కిల్ సమాచారం ప్రకారం ప్రస్తుతం నయనతార నాన్న కురియన్ కొడియట్టు అనారోగ్యంతో కోచిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నయన్-విఘ్నేశ్ ఇప్పటికే చార్టెడ్ ఫ్లైట్లో తండ్రి దగ్గరకు వెళ్లారట. అయితే తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇక ఆలస్యం చేయకుండా పెండ్లి చేసుకోవాలని కూతురు నయనతారను అడిగాడట కురియన్.
తండ్రి కోరిక మేరకు ఈ సారి నయనతార పెళ్లిపై పునరాలోచించి తగిన నిర్ణయం తీసుకుంటుందని అంతా భావిస్తున్నారు. అన్నీ కుదిరితే నయన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కడం ఖాయమైనట్టేనని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!
ఐటెంసాంగ్ తో సన్నీలియోన్ సందడి
బీచ్లో పూజాహెగ్డే..ఎక్కడికి వెళ్లిందో..?
యూట్యూబ్లో అజిత్ ‘వలిమై’ రికార్డుల మోత
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి