గణేశ్, హేమంత్, ప్రీతి సుందర్, జాహ్నవి ప్రధానపాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘స్పీడ్ 220’. ఈ సినిమా విడుదల అవుతున్న సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్లో ప్రెస్మీట్ నిర్వహించారు. యువతరానికి వినోదంతోపాటు, ఓ విలువైన సందేశాన్ని కూడా ఈ సినిమా ద్వారా అందించామని మేకర్స్ తెలిపారు.
ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు నటీనటులంతా కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రానికి దర్శకుడు: హర్ష బేజాగం, నిర్మాతలు ఎం.సూర్యనారాయణ, ఎం.దుర్గారావు.