సోమవారం 25 మే 2020
Cinema - Feb 16, 2020 , 09:52:18

మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్ట్‌లో తెలుగమ్మాయి.. !

మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్ట్‌లో తెలుగమ్మాయి.. !

మేలిమి ముత్యాల్లాంటి అద్భుతమైన చిత్రాలని తెరకెక్కించే  మేటి దర్శకుడు మణిరత్నం తాజాగా పొన్నియిన్‌ సెల్వన్‌ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కల్కి రాసిన నవల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. విక్రం, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్‌ వంటి భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రంలో తెలుగమ్మాయి అయిన శోభిత ముఖ్య పాత్రలో పోషించనుందంటూ వార్తలు వస్తున్నాయి. గూఢచారి చిత్రంలో అద్భుత ప్రదర్శన కనబరచిన శోభిత ప్రస్తుతం కురుప్‌ అనే మలయాళ చిత్రంతో పాటు లక్ష్మీ బాంబ్ అనే బాలీవుడ్‌ చిత్రం చేస్తుంది. పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రం ద్వారా తమిళ పరిశ్రమలోకి అడుగుపెడుతున్న శోభిత తన పాత్రతో ప్రేక్షకులకి మంచి వినోదం అందించడం ఖాయంగా కనిపిస్తుంది.  ఈ వార్త‌ల‌కి సంబంధించి పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది. 


logo