Sobhita Dhulipala | టాలీవుడ్ నటి శోభిత ధూళిపాళ్ల మరికొన్ని రోజుల్లో అక్కినేని కుటుంబంలోకి అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ భామ పెళ్లి కాకముందే ఫ్యూచర్లో తన సినిమాలు ఎలా ఉండాలో డిసైడ్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే సినిమాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నాగ చైతన్యతో పెళ్లి అనంతరం స్పెషల్ సాంగ్లలో నటించనని చెప్పినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ దర్శకుడు ఫర్హన్ అక్తర్, రణ్వీర్ సింగ్ కాంబోలో వస్తున్న డాన్ 3 సినిమాలో ఐటం సాంగ్ కోసం శోభితను సంప్రదించగా.. ఈ ఆఫర్ను రిజెక్ట్ చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమా కోసం ఇంకా ఏదైనా రోల్ ఉంటే చేస్తాను అని శోభిత అడిగినట్లు తెలుస్తుంది.
మరోవైపు నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల డెస్టినెషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చైతూ ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీలో ఉండగా.. శోభిత పలు వెబ్ సిరీస్లలో నటిస్తుంది. ఈ సినిమాలు కంప్లీట్ అయ్యాక వీరిద్దరు వెడ్డింగ్ ప్లాన్ ఉంటుందని సమాచారం.
Also Read..