Bus in river : ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ టూరిస్టు బస్సు యాత్రికులతో వెళ్తూ.. (Indian passenger bus) అదుపుతప్పి నేపాల్ (Nepal) లోని తానాహున్ జిల్లాలో మార్స్యాంగ్డి నది (Marsyangdi river) లో పడిపోయింది. అనంతరం ఒడ్డుకు కొట్టుకుని వచ్చింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. అయితే ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది యాత్రికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
బస్సు నదిలో పడిన సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు మొత్తం 14 మృతదేహాలను వెలికి తీశారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మిగతా 26 మృతదేహాల కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. దాంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
కాగా ‘భారత్‌కు చెందిన యూపీ ఎఫ్టీ 7623 (UP FT 7623) నెంబర్‌గల బస్సు ఈ ఉదయం మార్స్యాంగ్డి నదిలోకి దూసుకుపోయింది. బస్సు పొఖారా నుంచి ఖాట్మండుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Nepal | “14 bodies retrieved from the site of the bus accident,” confirms Kumar Neupane, Spokesperson for the Armed Police Force. https://t.co/N6n2Kj8xUe
— ANI (@ANI) August 23, 2024