Jammu Kashmir Assembly Elections : జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్తో సీట్ల పంపిణీపై చర్చలు జరుగుతున్నాయని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. చాలా సీట్లపై తాము ఏకాభిప్రాయానికి వచ్చామని, కొన్ని సీట్ల విషయంలో తాము పట్టుబడుతుండగా, మరికొన్ని స్ధానాల విషయంలో కాంగ్రెస్ స్ధానిక నేతలు పట్టుబడుతున్నారని చెప్పారు.
ఒమర్ అబ్దుల్లా కుల్గాంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఈరోజు జరిగే చర్చల్లో మిగిలిన స్ధానాలపై స్పష్టత వస్తుందని తెలిపారు. కూటమి పోటీ చేసే స్ధానాలు, అభ్యర్ధుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. కాగా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీతో ఎన్నికలకు ముందు లేదా ఎన్నికల అనంతరం పొత్తు ఉంటుందా అనే అంశంపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు.
పొత్తుపై తమకేమీ తెలియదని, ముందుగా ఎన్నికలకు సిద్ధమవడంపైనే తాము ప్రధానంగా దృష్టి సారించామని స్పష్టం చేశారు. పొత్తులపై ఏ ఒక్కరికీ తలుపులు మూసివేయలేదని తేల్చిచెప్పారు.కాంగ్రెస్తో కూటమి ఏర్పాటుకు తమ కనీస ఉమ్మడి కార్యక్రమం ఎన్నికల్లో పోరాడటం, దేశంలో నియంతృత్వ పోకడలతో చెలరేగుతున్న విభజిత శక్తులను ఓడించడమేనని అన్నారు.ఇక జమ్ము కశ్మీర్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో జోష్ నెలకొంది. జమ్ము కశ్మీర్ మాజీ మంత్రి, డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (DPAP) నేత తాజ్ మొహియుద్దీన్ ఇటీవల కాంగ్రెస్లో చేరారు.
Read More :
Megha Akash | ఆరేండ్ల ప్రేమ.. ప్రియుడితో మేఘా ఆకాశ్ ఎంగేజ్మెంట్