Skanda Movie | ఏంటి బోయ చూసుకోబడ్ల.. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న ‘స్కంద’
Skanda Movie OTT | టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం స్కంద (Skanda) ది అటాకర్. ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా మిగిలింది.
Skanda Movie OTT | టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం స్కంద (Skanda) ది అటాకర్. ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా మిగిలింది. వినాయక చవితి లాంగ్ వీకెండ్లో ఊహించని రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ చిత్రం ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయింది. ఇక ఎప్పటిలాగే ఫిజిక్స్‌కు అందని రీతిలో ఫైట్స్, మాస్ డైలాగ్స్, ఏడుపులు అన్నీ పాత చింతకాయ పచ్చడిలానే బోయపాటి ఈ సారి కూడా వడ్డించాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక థియేటర్లలో మిస్ అయిన ఫ్యాన్స్ ఈ సినిమాను ఓటీటీల్లో చూడటం స్టార్ట్ చేశారు. అయితే ఈ సినిమా థియేటర్లో కంటే ఓటీటీలో విడుదలైన అనంతరం ఎక్కువ ట్రోలింగ్‌కు గురవుతోంది.
ఈ సినిమాను ఓటీటీలో చూస్తున్న ప్రేక్షకులు ఒక్కో సీన్‌ను మెల్లిగా చూస్తూ.. చిన్న చిన్న విషయాలను కనిపెట్టారు. అయితే ఈ విషయాలే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్‌కు గురవుతున్నాయి.
స్కంద ఇంటర్వెల్ ఫైట్‌లో రామ్ ఒక పోలీస్‌ను షూట్ చేయగా.. ఇంకోవైపు ఆ సీన్‌ను చూస్తున్న వారిలో కూడా అదే వ్యక్తి కనిపిస్తాడు. దీంతో ఈ సీన్‌పై మామూలుగా ట్రోలింగ్ జరగట్లేదు.
Just Lord BOYA things🙌👏 pic.twitter.com/5YOqE0XEwG
— HARI™ (@harisrutea) November 2, 2023
అలాగే క్లైమాక్స్ ఫైట్‌లో రామ్ దీప స్తంభాలు పట్టుకుని విలన్ల మీద ఎటాక్ చేసే సీన్ ఒకటి ఉంటుంది. అయితే ఇది థియేటర్లో చూసిన వారికి తేడాగా అనిపించదు కానీ ఓటీటీలో చూసేవారు అందులో ఏం తేడా ఉందో కనిపెట్టారు. ఈ సీన్లో మొదట రామ్ కనిపించగా.. తర్వాత షాట్లో రామ్‌గా బోయపాటి దర్శనమిచ్చాడు. దీంతో ఈ సీన్ కట్ చేసి నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఏంటి బోయ చూసుకోబడ్ల అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
What is this BOYA🤣
Dhandam ra dhootha neeku🙏 #BoyapatiSreenu
Eeditho malli cinema theeyaku anna !! Please🤌 @ramsayz #Skanda pic.twitter.com/zJm092uRtn— UrstruelyVamC (@Vamsidarelli4) November 3, 2023
ఇంకా ఇదే కాకుండా.. కాలేజ్ సీన్లో పొలిటికల్ సైన్స్ క్లాసులో ఉన్న అమ్మాయిలు సంబంధం లేని పాథలాజీ, ‘ఫండమెంటల్స్ అఫ్ నెట్వర్క్ సెక్యూరిటీ పుస్తకాలు పట్టుకుని కనిపించిన షాట్ కూడా ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
#Skanda lo vaalu chadivedi Political Science but okka ammayi chethilo ‘Fundamentals of Network Security’ book, inko ammayi chethilo ‘Pathology Review’ book. Boya’s attention to detail 👌 pic.twitter.com/xfmwMLw4lm
— Hulkeshwara Shastry (@casual_babu) November 2, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

