Sivakarthikeyan | ఇటీవలే ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో తెరకెక్కిన మదరాసి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు శివకార్తికేయన్ (Sivakarthikeyan). ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కేవలం రెండు రోజుల్లోనే రూ.50 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. కాగా ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ కాంపౌండ్ నుంచి వస్తోన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ (25వ చిత్రం) ‘పరాశక్తి’ (Parasakthi). ఆకాశం నీ హద్దురా ఫేం డైరెక్టర్ సుధా కొంగర (Sudha Kongara) డైరెక్ట్ చేస్తున్నారు.
పొలిటికల్ పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న పరాశక్తిలో బాహుబలి యాక్టర్ రానా కీలక పాత్రలోనటిస్తున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై మూవీ లవర్స్‌లో నెలకొన్న డైలామాకు చెక్ పెట్టాడు శివకార్తికేయన్. సైమా అవార్డ్స్ ఈవెంట్లో డాన్ యాక్టర్ స్టన్నింగ్ వార్తను షేర్ చేశాడు. తాను రానా దగ్గుబాటితో కలిసి నటించానన్నాడు శివకార్తికేయన్. అయితే ఆ ప్రాజెక్ట్ ఏంటో చెప్పకపోయినప్పటికీ.. పరాశక్తి అని హింట్ ఇచ్చేశాడు.
రానా పొల్లాచ్చి షూటింగ్లో శ్రీలీలతో కలిసి జాయిన్ అయ్యాడని సమాచారం. ఈ మూవీలో రానాతోపాటు అథర్వ, రవి మోహన్, బాసిల్ జోసెఫ్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు రానా మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ మిరాయిలో కూడా కనిపించనున్నట్టు వార్తలు వస్తుండగా.. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
Janhvi Kapoor | జాన్వీ కపూర్ చాలా గ్రేట్.. అనీల్ కపూర్ కామెంట్స్ వైరల్
OTT | థియేటర్లో ఆదరణ లేదు.. ఓటీటీలో దుమ్ము లేపుతుందిగా..!
Bigg Boss9 | తొలి రోజే హౌజ్‌లో గందరగోళం..రీతూ చౌదరి, హరీష్, మనీష్ మధ్య మాటల యుద్ధం