కన్నడ అగ్రనటుడు శివరాజ్‌కుమార్ నటిస్తున్న కన్నడ, తెలుగు బైలింగ్వల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం శనివారం లాంఛనంగా మొదలైంది. కార్తీక్ అద్వైత్ దర్శకుడు. ఎస్.ఎన్.రెడ్డి, సుధీర్.పి నిర్మాతలు.
ఇందులో శివరాజ్‌కుమార్ అత్యంత శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తారని, హై బడ్జెట్‌తో తెరకెక్కనున్న యాక్షన్ థ్రిల్లర్ ఇదని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఎ.జె.శెట్టి, సంగీతం: సామ్ సిఎస్, సమర్పణ: పద్మజ ఫిల్మ్స్ ఇండియా ప్రై.లిమిటెడ్, నిర్మాణం: భువనేశ్వరి పిక్చర్స్.