బిగ్ బాస్ హౌజ్‌మేట్స్‌కి తమ జీవితంలో ఏర్పడ్డ అడ్డంకులు వివరించమని బిగ్ బాస్ చెప్పడంతో ఒక్కొక్కరు పలు విషయాలు చెబుతూ ఎమోషనల్ అయ్యారు.సిరి మాట్లాడుతూ.. వేరే వాళ్లను పెళ్లి చేసుకోవాలనుకున్నా అది ఆగిపొయింది. ప్రేమించిన వాడు చనిపోయాడు. ఆ సమయంలో తల్లేమైనా పద్ధతిగా ఉందా? కూతురు ఉండటానికి! అన్నారు. అప్పుడే డిసైడ్ అయ్యాను. నేనేంటో చూపిస్తానని! ఇంట్లో చెప్పా పెట్టకుండా హైదరాబాద్ వచ్చి కెరియర్ ప్రారంభించానని తెలిపింది సిరి.
ఇక ఆహారం తిననంటూ భీష్మించుకు కూర్చున్న సిరికి షణ్ముఖ్ గోరు ముద్దలు తినిపించాడు. అనంతరం కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఎవరు ఎక్కువ సేపు బెలూన్లు ఉంచుకోగలిగితే వారే గెలిచినట్లు అని చెప్పాడు. సూది దక్కించుకున్న కంటెస్టెంట్..మిగతా కెప్టెన్సీ పోటీదారుని బెలూన్ను పగలగొట్టాలి. అలా చివరి వరకు ఎవరి బెలూన్ ఉంటుందో వారే విజేత అని చెప్పాడు.
మొదట సూదిని జెస్సీ అందుకున్నాడు. కాజల్‌కు ఇచ్చాడు. విశ్వ బెలూన్ను పగలగొట్టేందుకు కాజల్ ప్రయత్నించింది. ఆ క్రమంలో విశ్వ బెలూన్ పగిలిపోయింది. కాజల్ పగలగొట్టకుండానే అది పగిలిపోయింది. ఇక రెండో ప్రయత్నం, మూడో ప్రయత్నంలో సూదిని విశ్వ దక్కించుకున్నాడు. ఆ రెండు సార్లు కూడా రవికే ఇచ్చాడు. అలా మానస్, కాజల్‌లను పోటీ నుంచి రవి తప్పించాడు.
ఇక చివరగా ఆనీ మాస్టర్ సూదిని దక్కించుకుంది. సన్నీకి ఆ సూదిని ఇచ్చింది. దాంతో చివరగా రవి బెలూన్ను పగలగొట్టి తన చిరకాల వాంఛను నెరవేర్చుకుని ఇంటి కెప్టెన్‌గా మారాడు. అయితే తనని ఎంతగానో సపోర్ట్ చేసినందుకు అనీ మాస్టర్‌కి ఆనందంలోముద్దిచ్చాడు సన్నీ.