న్యూఢిల్లీ : ఈ ఏడాది సెప్టెంబర్‌లో మార్కెట్లోకి రానున్న ఐఫోన్ 13 ప్రొ ఫీచర్లపై పలు వార్తలు హల్చల్ చేస్తున్న క్రమంలో తాజాగా మోస్ట్ ఎవెయిటెడ్ స్మార్ట్‌ఫోన్ వైడ్‌యాంగిల్ లెన్స్‌తో, అప్‌గ్రేడెడ్ కెమెరాతో ఆకట్టుకుంటుందని టెక్ ఎనలిస్ట్ మింగ్ చుకో పేర్కొన్నారు. ఐఫోన్ 13 ప్రొ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ కలిగిన తొలి స్మార్ట్‌ఫోన్‌గా ఐఫోన్ 13 నిలవనుందని సమాచారం.
టచ్, ఫేస్ ఐడీ కలయికతో ఏ15 బయోనిక్ చిప్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ రానుందని సమాచారం. హై రిఫ్రెష్ రేట్, భారీ బ్యాటరీలు వంటి ప్రత్యేకతలతో ఈ స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకోనుంది. ఐఫోన్ 13 సిరీస్ ప్రారంభ ధర 69,990 కాగా..టాప్ మోడల్ ధర 1,49,990 వరకూ ఉంటుందని అంచనా. ఇక సెప్టెంబర్‌లో లాంఛ్ కానున్న ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, 13 ప్రొ, 13 ప్రొ మ్యాక్స్ మోడళ్లు లాంఛ్ కానున్నాయి. ఐఫోన్ 13 సిరీస్ గత వెర్షన్స్ కంటే వేగవంతంగా ఉండటంతో పాటు మెరుగైన ప్రాసెసర్‌ను కలిగిఉంటాయని భావిస్తున్నాయి.