కోల్‌కతా : సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ సింగర్ కేకే పేరొందిన కృష్ణకుమార్ కున్నత్ (53) హఠాన్మరణం చెందారు. కోల్‌కతాలో బుధవారం రాత్రి సంగీత ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత హోటల్‌కు చేరుకున్న తర్వాత గదిలోనే కుప్పకూలినట్లు సమాచారం. ఆ తర్వాత ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు సీఎంఆర్ఐ దవాఖాన వైద్యులు పేర్కొన్నారు.
అంతకు ముందు కేకే తన మ్యూజికల్ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కేకే గత మూడు దశాబ్దాల్లో హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, బెంగాలీ భాషల్లో అనేక చిత్రాల్లో పాటలు పాడారు. కేకే తెలుగులో ఇంద్రా, సంతోషం, ఘర్షణ, గుడుంబా శంకర్, నేనున్నాను, సైనికుడు తదితర చిత్రాల్లో పాటలు పాడారు. కేకే మృతిపై ప్రధాని మోదీ సహా పలువురు రాజకీయ నాయకులు, బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
From today’s performance pic.twitter.com/bS9FFF4TPm
— Indra The_Great (@indra20099) May 31, 2022
‘కేకే పాటలు అన్ని వయసుల వారిని ఆకట్టుకునేలా, అనేక రకాల భావోద్వేగాలను ప్రతిబింబించాయి. పాటల ద్వారా ఆయనను మేం ఆయనను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు సంతాపం’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కేకే మరణ వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని, ఆయన మరణం విచారకరమని, చిత్ర పరిశ్రమకు ఎంతో నష్టమని బాలీవుడ్ నటుడు కుమార్ ట్వీట్ చేశారు.