Singer Kalpana | నేను సూసైడ్ చేసుకోలేదు : సింగర్ కల్పన
ప్రముఖ నేపథ్య గాయని కల్పన(Kalpana) తాజాగా మీడియాతో మాట్లాడింది. తాను సూసైడ్ చేసుకోలేదని తన కూతురితో జరిగిన వాగ్వాదం వలన నిద్రమాత్రలు అధిక మొత్తంలో మింగినట్లు తెలిపింది.
Singer Kalpana | ప్రముఖ టాలీవుడ్ సింగర్ కల్పన (Playback Singer Kalpana) తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదని తెలిపింది. తాను సుసైడ్ అటెంప్ట్ చేయలేదని, తన కూతురితో జరిగిన మనస్పర్థల కారణంగా నిద్ర లేకపోవడంతో అధిక మోతాదులో నిద్రమాత్రలు తీసుకోవడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు వివరణ ఇచ్చారు. ఈ విషయంలో ఎవరి తప్పులేదని కల్పన తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా ఈ సంఘటనపై కేపీహెచ్‌బీ పోలీసులు ప్రెస్ నోట్ విడుదల చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. సింగర్ కల్పనా రాఘవేంద్ర గత 5 ఏండ్లుగా తన భర్త ప్రసాద్‌తో కలిసి హైదరాబాద్‌లోని ఒక విల్లాలో నివసిస్తున్నారు. ఇటీవల ఆమె కుమార్తె, కల్పనకి, ప్రసాద్‌కి చదువు విషయంలో గొడవ జరిగింది. ఈ విషయంలోనే కల్పన ఒత్తిడికి గురి అయ్యింది. అయితే ఈ విషయం జరిగిన అనంతరం కల్పన హైదరాబాద్‌కి తిరిగివచ్చారు. అయితే కల్పన హైదరాబాద్‌కి వచ్చిన అనంతరం ఆమె భర్త ఫోన్ చేయగా.. కల్పన నుంచి స్పందన లేదు. దీంతో ఆందోళన చెందిన ఆయన కల్పన ఉంటున్న ఆపార్ట్మెంట్ సభ్యులకు సమాచారం అందించాడు. అయితే ఆపార్ట్మెంట్ సభ్యులు కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే కల్పన ఉన్న ప్లాట్ దగ్గరికి వచ్చిన పోలీసులు తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. అయితే తాళం తెరుచుకోకపోవడంతో.. వెనుక వైపు ఉన్న కిచెన్ బాల్కానీ నుంచి లోపలికి ప్రవేశించి, బెడ్ రూమ్‌లో అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read..
Singer Kalpana | వెంటిలేటర్‌పై చికిత్స.. కల్పన హెల్త్ బులెటిన్ విడుదల
Singer Kalpana | సింగర్ కల్పన స్టేట్మెంట్ని రికార్డు చేసిన పోలీసులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

