ప్రముఖ సినీ గాయని చిన్మయి శ్రీపాద (Singer Chinmayi) మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడింది. సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆమె హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) దృష్టికి తీసుకెళ్లింది. చిన్మయి చేసిన ఫిర్యాదు ప్రకారం… సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు చాటింగ్ ద్వారా తనను ఉద్దేశిస్తూ రాయడానికి వీలు లేని అసభ్య పదాలతో వేధిస్తున్నారు. తాను సాధారణంగా ట్రోలింగ్‌ను పట్టించుకోనప్పటికీ, ఈసారి ట్రోలర్స్ తన పిల్లలను కూడా ట్రోలింగ్‌లోకి లాగి, వారు చనిపోవాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ముఖ్యంగా, ‘మంగళసూత్రం’ ధరించడం గురించి తన భర్త, నటుడు రాహుల్ రవీంద్రన్ ఇటీవల చేసిన కామెంట్స్‌పై ఒక యువకుడు అసభ్యంగా ట్రోల్ చేయడాన్ని చిన్మయి పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు.
అయితే చిన్మయి ఫిర్యాదుపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ తక్షణమే స్పందించారు. ఈ విషయంపై వెంటనే స్పందించాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు హైదారాబాద్ పోలీసులను ఆదేశించాడు.
ఈ వివాదానికి కారణం:
సింగర్ చిన్మయి భర్త, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ప్రస్తుతం తన తాజా చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఒక మీడియా ఇంటర్వ్యూలో ‘మంగళసూత్రం’ గురించి మాట్లాడుతూ, “మంగళసూత్రం ధరించాలా? వద్దా? అనేది పూర్తిగా తన భార్య చిన్మయి నిర్ణయం అని. ఆ విషయంలో ఆమెను తాను బలవంతం చేయను అని వ్యాఖ్యానించారు. అయితే రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి. కొందరూ వ్యాఖ్యలపై రాహుల్‌కి మద్దతునిస్తుండగా.. మరికొందరూ.. హిందు ధర్మాన్ని కించపరుస్తున్నారంటూ చిన్మయి-రాహుల్ దంపతులను టార్గెట్ చేసి విమర్శించడం మొదలుపెట్టారు. అయితే ఈ వివాదంలో చివరకు పిల్లల వరకు వెళ్లి ట్రోల్ చేయడంతో చిన్మయి పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.
@CyberCrimeshyd @hydcitypolice pl check.
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 5, 2025