Singapore Consul General | తమిళ నటుడు, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత దళపతి విజయ్(Thalapathy Vijay)ని సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గర్ పాంగ్(Edgar Pong) మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం విజయ్ నివాసానికి వెళ్లిన ఎడ్గర్ పాంగ్ విజయ్‌ని కలిసి అతటితో కాసేపు ముచ్చటించాడు. అనంతరం వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోను ఎక్స్ వేదికగా పాంగ్ పోస్ట్ చేశాడు.
”తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్‌ని ఈ మధ్యాహ్నం కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన నటించిన మీ అభిమాన తమిళ సినిమా ఏది?” అంటూ పాంగ్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. కాగా ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారింది.
సినిమాల విషయానికి వస్తే.. విజయ్ ప్రస్తుతం తన చివరి చిత్రం జననాయగన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజ హెగ్దే కథానాయికగా నటిస్తుంది.
A pleasure to meet Kollywood superstar #Thalapathy @actorvijay this afternoon. What is your favourite Tamil movie that he has starred in? – CG Pang pic.twitter.com/YNH153zATf
— Singapore in India (@SGinIndia) June 27, 2025
Read More