Sindoor | పహల్గాం ఉగ్రదాడిలో దాదాపు 28మంది అమాయకులు మృత్యువాత పడ్డారు. అతి దారుణంగా మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఈ ఉగ్రవాద దాడిలో 26 ఏళ్ల ఓ నేవీ అధికారి వినయ్ తుది శ్వాస విడిచాడు. కేవలం పెళ్లైన ఐదు రోజులకే భర్త చనిపోవడంతో భార్య హిమాన్షి గుండె పగిలేలా ఏడ్చింది.చాలా మంది మహిళల భర్తలు కూడా దారుణంగా చనిపోయారు. అందుకే భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడి చేసి వాటిని ధ్వంసం చేసింది. వివాహం అయిన స్త్రీ జీవితంలో సిందూరం ఎంత ముఖ్యమో మనందరికి తెలిసిందే. ఆ సిందూరాన్ని చెరిపేసిన క్రమంలో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఒక రాత్రిలోనే మూడు టెర్రర్ హెడ్‌క్వార్టర్స్ నేలమట్టం చేసింది.
ఈ ఘటన తర్వాత బాలీవుడ్ మూవీ సిందూర్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. జయప్రద నటించిన ఈ చిత్రం వితంతువు జీవితం ఆధారంగా రూపొందింది. భర్త మరణం తర్వాత ఆమె తన కుమార్తెని ఎలా పెంచుకున్నదనేదే కథ ఈ సినిమాలో రిషి కపూర్ , ప్రేమ్ కపూర్, న్యాయవాది ధర్మదాస్ , సునీత కపూర్, ప్రేమ్ చోప్రా, షేరా , గుల్షన్ గ్రోవర్ – నిశాంత్ , అస్రానీ, ఎ.కె. హంగల్ వంటి ప్రముఖ తారలు నటించారు.ఈ సినిమాకు కె. రవిశంకర్ దర్శకత్వం వహించారు. కాదర్ ఖాన్ సంభాషణలు రాశారు. 14 ఆగస్టు 1987న విడుదలైన ఈ సినిమాను టీనూ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ నిర్మించింది. దీనికి లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సంగీతం అందించారు.
చిత్రంలోని “పత్ఝడ్, సావన్, బసంత్ బహార్” అనే పాట సూపర్ హిట్ కాగా, మూవీ కూడా మంచి విజయం సాధించింది. వితంతువుగా జయప్రద కూడా మంచి ప్రదర్శన కనబరిచింది. ఈ చిత్రం తమిళ చిత్రం ఉన్నై నాన్ శాంతితేన్ (1984) రీమేక్ గా రూపొందింది. 14 ఆగస్టు 1987న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అంతేకాక 1987లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా ఈ మూవీ నిలిచింది. మొత్తానికి ఆపరేషన్ సిందూర్ తర్వాత జయప్రద నటించిన బాలీవుడ్ చిత్రం సిందూర్ ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది.