టాలీవుడ్ యాక్టర్ నిఖిల్ సిద్దార్థ (Nikhil) నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ 18 పేజెస్ (18 Pages). అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్ట్ చేస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌గా వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే నన్నయ రాసిన అంటూ సాగే పాట సంగీత ప్రియుల్ని ఫిదా చేస్తోంది.
కాగా ఈ చిత్రంలో మరో పాటను కోలీవుడ్ స్టార్ హీరో శింబు పాడాడు. దీనికి సంబంధించిన అప్డేట్ను మేకర్స్ అందించారు. టైం ఇవ్వు పిల్లా పాటను శింబు పాడగా.. డిసెంబర్ 5న లాంఛ్ చేయబోతున్నట్టు స్పెషల్ పోస్టర్ ద్వారా తెలియజేశారు మేకర్స్. గోపీసుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
ఈ చిత్రం డిసెంబర్ 23న గ్రాండ్‌గా థియటర్లలో విడుదల కాబోతుంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2-సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీవాసు నిర్మిస్తున్నారు. 18 పేజెస్కు స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథనందిస్తున్నాడు.
Team #18Pages is delighted to have @SilambarasanTR_ on board for the next single #TimeIvvuPilla 🤩#ThankYouSTR ~ #STRFor18Pages 🎤
Full song out on DEC 5th!@aryasukku @actor_Nikhil @anupamahere @dirsuryapratap @GopiSundarOffl #BunnyVas @lightsmith83 @NavinNooli @adityamusic pic.twitter.com/YowhmSCmzk
— BA Raju's Team (@baraju_SuperHit) November 28, 2022
Read Also : PushpaTheRise | రష్యా బాక్సాఫీస్ గెట్ రెడీ అంటున్న పుష్పరాజ్.. వివరాలివే
Yogi Babu | సూర్య 42 సెట్స్‌లో కేక్ కట్ చేసిన స్టార్ కమెడియన్.. స్పెషల్ ఏంటో తెలుసా..?
SSMB28 | ఎస్ఎస్ఎంబీ 28 నాన్‌స్టాప్ షూటింగ్‌కు మహేశ్‌బాబు ప్లాన్..!